బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో అనేక చిత్రాల్లో కథానాయికగా నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు విజయనిర్మల. 1967లో సాక్షి సినిమాతో కృష్ణతో కలిసి తొలిసారి నటించారు విజయనిర్మల. ఆ తర్వాత వీరిద్దరూ నిజజీవితంలోనూ ఒక్కటయ్యారు. తర్వాత స్వయంకృషి, స్వీయ ప్రతిభ చిత్రాలలో నటిస్తూనే దర్శకత్వం పై మొగ్గుచూపారు. సాక్షి సినిమా షూటింగ్ సందర్భంగా బాపు డైరెక్షన్ లో ఆ మెళుకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆమె వెంటనే మలయాళ చిత్రం కవితను స్వీయ దర్శకత్వంలో నిర్మించి విజయం సాధించారు.