Cock Fights: పందెం బరిలోకి దిగితే.. అక్కడ్నుంచి నేరుగా సెల్‌లోకే.. కృష్ణా జిల్లా పోలీసుల వార్నింగ్

|

Jan 10, 2021 | 3:35 PM

పొంగల్ సీజన్ వచ్చేసింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో పందెం రాయుళ్లు.. కోడి పందేలు నిర్వహించడానికి రెడీ అయిపోయారు.

Cock Fights: పందెం బరిలోకి దిగితే.. అక్కడ్నుంచి నేరుగా సెల్‌లోకే.. కృష్ణా జిల్లా పోలీసుల వార్నింగ్
Follow us on

పొంగల్ సీజన్ వచ్చేసింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో పందెం రాయుళ్లు.. కోడి పందేలు నిర్వహించడానికి రెడీ అయిపోయారు. కత్తులు సిద్దం చేస్తున్నారు. బరులు రెడీ చేశారు. మరికొన్ని చోట్లు అయితే పందేలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా పోలీసులు అలెర్టయ్యారు. కోడి పందాలు నిర్వహిస్తే తాట తీస్తామని హెచ్చరించారు.

సంప్రదాయాల పేరుతో మూగజీవాలను  క్రూరంగా హింసిస్తున్నారని, పశువులు, పక్షుల విషయంలో క్రూరంగా వ్యవహరిస్తే.. ఉపేక్షించేదిలేదని ఎస్పీ రవీంద్రనాథ్ లేల్చి చెప్పారు. వారం రోజుల నుంచి కోడిపందాల స్థావరాలు, పేకట శిబిరాలపై దాడులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఈ క్రమంలో 370 మంది పేకాట రాయుళ్లు, 66 మంది కోడిపందాళ్ల రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 16 పందెం కోళ్లు, 1238 కోడి కత్తులు, 26 బైకులు, రెండు కౌంటింగ్ మెషీన్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Also Read :

Fake currency: మంచిర్యాల జిల్లాలో దొంగనోట్ల కలకలం.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Jagananna Amma Vodi: ఎన్నికల కోడ్ ఉన్నా ‘అమ్మఒడి’ పథకం యథాతథం.. స్పష్టం చేసిన విద్యాశాఖ మంత్రి