AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిబంధనలు ఉల్లంఘన.. విజయవాడలో మరో ప్రైవేట్ ఆసుపత్రిపై చర్యలు.!

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ,  లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న మరో ప్రైవేట్ ఆసుపత్రిపై వేటు పడింది.

నిబంధనలు ఉల్లంఘన.. విజయవాడలో మరో ప్రైవేట్ ఆసుపత్రిపై చర్యలు.!
Ravi Kiran
|

Updated on: Sep 13, 2020 | 12:38 PM

Share

Covid Center In Liberty Hospital: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ,  లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న మరో ప్రైవేట్ ఆసుపత్రిపై వేటు పడింది. కృష్ణా జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో కోవిడ్ వైద్యాన్ని కలెక్టర్ ఇంతియాజ్ రద్దు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన కలెక్టర్.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

విజయవాడలోని లిబర్టీ హాస్పిటల్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని రాజమండ్రికి చెందిన ఓ మహిళ కలెక్టర్ ఇంతియాజ్‌కు ఫిర్యాదు చేసింది. లక్షల రూపాయలు వసూలు చేసి తన భర్త ప్రాణాలు పోగొట్టారని ఆరోపించింది. ఇక బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ విచారణ చేపట్టి.. లిబర్టీ హాస్పిటల్‌లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నివేదిక ఆధారంగా ఆటోనగర్‌లోని లిబర్టీ ఆసుపత్రిలో కోవిడ్ పేషేంట్లకు చికిత్సను జిల్లా కలెక్టర్ రద్దు చేశారు. కాగా, ప్రస్తుతం ఆ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కరోనా రోగులను వేరే చోటుకి తరలించాలని డీఎంహెచ్ఓకు ఆదేశాలు జారీ చేశారు.

Follow Us
ఇంటర్‌ ప్రవేశాలకు TGRJC CET 2026 దరఖాస్తులు ప్రారంభం
ఇంటర్‌ ప్రవేశాలకు TGRJC CET 2026 దరఖాస్తులు ప్రారంభం
చెన్నై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ధోనీ రీఎంట్రీ డేట్ ఫిక్స్
చెన్నై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ధోనీ రీఎంట్రీ డేట్ ఫిక్స్
ఎండాకాలంలో తులసి మొక్క ఎండిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా..
ఎండాకాలంలో తులసి మొక్క ఎండిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా..
థియేటర్లలో, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
థియేటర్లలో, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా తెచ్చి..
అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా తెచ్చి..
NEST 2026కు దరఖాస్తు చేశారా? ఎంపికైతే ఏడాదికి రూ.80 వేలు మీ సొంతం
NEST 2026కు దరఖాస్తు చేశారా? ఎంపికైతే ఏడాదికి రూ.80 వేలు మీ సొంతం
మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే..
మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే..
మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా?
మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా?
మామిడి అల్లం రోటి పచ్చడి ఇలా చేసారంటే కుమ్మెయాల్సిందే..
మామిడి అల్లం రోటి పచ్చడి ఇలా చేసారంటే కుమ్మెయాల్సిందే..
వెండి గొలుసులు నల్లగా మారాయా?.. ఇలా సింపుల్‌ మెరిపించండి
వెండి గొలుసులు నల్లగా మారాయా?.. ఇలా సింపుల్‌ మెరిపించండి