AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంచలన నిర్ణయం తీసుకున్న కోలీవుడ్ హీరో విజయ్

నటుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఏ చంద్ర శేఖర్ సానుభూతిపరులను అభిమాన సంఘం నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో 30 జిల్లాలకు చెందిన జిల్లా అధ్యక్షులతో,

సంచలన నిర్ణయం తీసుకున్న కోలీవుడ్ హీరో విజయ్
Sanjay Kasula
|

Updated on: Nov 11, 2020 | 10:36 PM

Share

తమిళనాడులో తండ్రి కొడుకుల రాజకీయ వ్యవహారం రంజుగా సాగుతోంది.  అభిమానులతో సమావేశం తరువాత నటుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఏ చంద్ర శేఖర్ సానుభూతిపరులను అభిమాన సంఘం నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో 30 జిల్లాలకు చెందిన జిల్లా అధ్యక్షులతో, జిల్లా కార్యకర్తలతో విజయ్ అత్యవసర భేటీ జరిపాడు. మదురై, తిరుచ్చి, తో సహా పలు జిల్లాలో నుతన జిల్లా అధ్యక్షులను , కార్యకర్తలను నియమించినట్లు నటుడు విజయ్ ప్రకటించాడు.

తన తండ్రితో సంబంధాలున్న ప్రతి ఒక్కరిని విజయ్ మక్కళ్ ఇయక్కం నుండి తొలిగించినట్లు విజయ్ ప్రకటించాడు. తన ఫోటోని కానీ..విజయ్ మక్కళ్ ఇయక్కం పేరుని గాని.. సంఘంలో ఉన్న ముఖ్య కార్యకర్తల అనుమతిలేనిదే ఉపయోగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని నటుడు విజయ్ హెచ్చరించారు.

కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ అనుమతి లేకుండా ఆయన తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్, విజయ్ పేరు మీద రాజకీయ పార్టీ ఏర్పాటుకి ఎన్నికల కమిషన్ కి నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తండ్రి చర్యలను హీరో విజయ్ పూర్తిగా తప్పుబట్టాడు. తనకి, తన తండ్రి పెట్టనున్న రాజకీయపార్టీకి సంబంధం లేదని వెల్లడించాడు.