182 మంది పెద్దింటి మహిళలను..ట్రాప్ చేసి..వీడియోలు తీసి..

|

Jan 31, 2020 | 9:53 PM

వారివి పేరుకే బడా బిజినెస్ ఫ్యామిలీస్. చీకటి బాగోతం వేరే ఉంది. తమ వద్దకు వచ్చిన పెద్దింటి విమెన్ కస్టమర్స్‌ను ట్రాప్ చెయ్యడం..వారితో సెక్స్‌వల్ రిలేషన్ పెట్టుకోవడం..ఆ వీడియోలు రికార్డు చేసి..డబ్బులు గుంజడం. ఇలా వారు ఇప్పటివరకు 182 మంది పెద్దింటి మహిళలను టార్గెట్ చేశారు. వారు అంటే అదేదో పెద్ద బ్యాచ్ ఏం కాదండి. కేవలం ముగ్గురే ముగ్గురు.. కానీ మహా జాదు గాళ్లు. ఏదో చీటింగ్ కేసులో ఈ ముగ్గురిలో ఒక వ్యక్తిని పోలీసులు […]

182 మంది పెద్దింటి మహిళలను..ట్రాప్ చేసి..వీడియోలు తీసి..
Follow us on

వారివి పేరుకే బడా బిజినెస్ ఫ్యామిలీస్. చీకటి బాగోతం వేరే ఉంది. తమ వద్దకు వచ్చిన పెద్దింటి విమెన్ కస్టమర్స్‌ను ట్రాప్ చెయ్యడం..వారితో సెక్స్‌వల్ రిలేషన్ పెట్టుకోవడం..ఆ వీడియోలు రికార్డు చేసి..డబ్బులు గుంజడం. ఇలా వారు ఇప్పటివరకు 182 మంది పెద్దింటి మహిళలను టార్గెట్ చేశారు. వారు అంటే అదేదో పెద్ద బ్యాచ్ ఏం కాదండి. కేవలం ముగ్గురే ముగ్గురు.. కానీ మహా జాదు గాళ్లు. ఏదో చీటింగ్ కేసులో ఈ ముగ్గురిలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చెయ్యగా..ఈ కేటుగాళ్ల అస్సలు బాగోతం వెలుగులోకి వచ్చింది.

కోల్‌కతాలో అనీష్, ఆదిత్య అనే వ్యక్తులు జాన్ జిగ్రీ ఫ్రెండ్స్. ఒకరు ఫ్యామిలీ హోటల్ బిజినెస్‌లో, మరొకరి ఫ్యామిలీ టెక్స్‌టైల్ బిజినెస్‌లో టాప్ రేంజ్‌లో ఉన్నాయి. అయినా వీరి బుద్ది మాత్రం మాయలమారిది. అనిష్, ఆదిత్య ముందు మంచి రిచ్ ఫ్యామిలీలలో ఉండే మహిళలను ట్రాప్ చేస్తారు. వారితో గంటల తరబడి ఫోన్లు మాట్లాడి..లైంగికంగా లొంగదీసుకుంటారు. పడకగదిలో ఉన్న సమయంలో వీడియోలో రికార్డు చేసి..బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడతారు. అయితే ఇక్కడ వీరికొక ఫార్మాట్ ఉంది. వారితో రహస్యంగా ఉన్న వీడియోలు సంపాదించగానే..ఈ ఇద్దరు సదరు మహిళలను దూరం పెడతారు. ఇప్పుడు ఈ కంత్రీగాళ్ల ఇళ్లల్లో కుక్‌గా పనిచేస్తోన్న కైలాష్ యాదవ్ అనే వ్యక్తి రంగంలోకి దిగుతాడు. మీ అశ్లీల వీడియోలు ఉన్నాయని, అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఇంటర్నెట్‌లో పెడతానని చెప్పి..సదరు మహిళల నుంచి డబ్బు దండుకుంటాడు. ఇలా వీరు చాలామంది మహిళలను బెదిరించి డబ్బు వసూలు చేశారు. అయితే వేరే ఏదో కేసులో ఇటీవలే కైలాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాప్స్ తమ స్టైల్లో విచారణ చేస్తే..డొంకంతా కదిలింది. వారి దగ్గర దాదాపు 182 మంది మహిళల అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తోన్నారు.