కాలు దువ్వుతున్న కోళ్లు.. కత్తి కట్టిన ప్రజాప్రతినిధులు.. వేలాదిగా తరలివచ్చిన పందెంరాయుళ్లు

|

Jan 13, 2021 | 2:26 PM

పందాలు జరగడం కాదు...ఓ జాతరలా నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పోలీసులు పర్మిషన్‌ లేదని చెప్పినప్పటికి... సుమారు 150 నుంచి 200 చోట్ల నిర్వాహకులు భారీ..

కాలు దువ్వుతున్న కోళ్లు.. కత్తి కట్టిన ప్రజాప్రతినిధులు.. వేలాదిగా తరలివచ్చిన పందెంరాయుళ్లు
Follow us on

Kodi Pandalu : పందాలు జరగడం కాదు…ఓ జాతరలా నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పోలీసులు పర్మిషన్‌ లేదని చెప్పినప్పటికి… సుమారు 150 నుంచి 200 చోట్ల నిర్వాహకులు భారీ ఎత్తున బరులు ఏర్పాటు చేసి పందాలు ప్రారంభించారు.

ఏలూరు సమీపంలోని చారుపర్రులో కోడిపందాలు జోరుగా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చే పందాల రాయుళ్ల కోసం బరుల దగ్గర బిర్యానీ సెంటర్లు, ఫ్రూట్‌ స్టాల్స్, కార్ పార్కింగ్ ప్రదేశం.. ఇలా ఒకటేమిటి.. అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో జోరుగా సాగుతున్న కోడి పందేలు జరుగుతున్నాయి. నిర్వాహకులు ఏర్పాటు చేసిన బరుల దగ్గరకు వేలాదిగా పందాల రాయుళ్లు తరలివస్తున్నారు. సాక్షాత్తు ప్రజాప్రతినిధులే పోటీలను ప్రారంభించడంతో నిర్వాహకులు పోలీసుల ఆంక్షలను తుంగలో తొక్కి మరి దర్జాగా పోటీలను నిర్వహిస్తున్నారు.

ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఈ రెండు మండలాల్లో గుంటాడ, మూడు ముక్కలాటతో పాటు కోడి పందెల్లో సుమారు లక్షల రూపాయల్లో చేతులు మారినట్లుగా తెలుస్తోంది. ఉండిలో స్థానిక ఎమ్మెల్యే రామరాజు కోడి పందెల్ని దగ్గరుండి ప్రారంభించారు. కోడి పొట్లాటలు సంప్రదాయం ప్రకారం జరుగుతున్నాయని…నియోజకవర్గ ప్రజలే కాకుండా…వేర్వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వాళ్లు పోటీలు చూసి తమ గత అనుభవాల్ని గుర్తు చేసుకుంటారని రామరాజు తెలిపారు. అటు కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కూడా కోడి పందాలను ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి