ఏపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఖాళీగా కూర్చొని 500 మంది రాష్ట్ర కార్యదర్శులు.. వెయ్యి మంది ఉపాధ్యక్షులను నియమించారని.. వారంతా టీడీపీ పార్టీ ఆఫీస్‌లో బ్రోకర్ పనులు చేసుకుంటూ.. పేపర్లు మోసుకుంటూ తిరుగుతున్నారన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జీతాలతో ప్రెస్‌మీట్ కొచ్చి మాట్లాడే వెధవలు ఆ పార్టీలో ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొడాలి నాని విజయవాడలో చెప్పుకొచ్చారు. జగన్ పాదయాత్రలో తీర ప్రాంత ప్రజల కష్టాలు చూశారని.. గాలి కబుర్లు చెప్పి గాలికే వదిలేసిన ప్రభుత్వాలను చూశామన్నారు కొడాలి.