కిమ్ కంటే ఈమె యమా డేంజరట.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

|

Apr 22, 2020 | 2:04 PM

ఉత్తర కొరియా అధక్ష్యుడు కిమ్ జాంగ్ ఉన్.. ఈయన్ని ముద్దుగా హిట్లర్ 2.0 అని పిలుచుకుంటారు. ఉండేది జానడే అయినా ఆయన చేష్టలు, చర్యలతో అగ్రరాజ్యలను సైతం గడగడలాడించాడు. ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినని వ్యక్తి. ఆఖరికి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను కూడా తన రాజ్యంలోకి రానివ్వలేదు. అంతటి నియంత ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వార్తలొస్తున్నాయి. అయితే నార్త్ కొరియా వర్గాలు ఈ ప్రచారాన్ని కొట్టిపారేసినా.. ప్రపంచ మీడియాలో […]

కిమ్ కంటే ఈమె యమా డేంజరట.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
Follow us on

ఉత్తర కొరియా అధక్ష్యుడు కిమ్ జాంగ్ ఉన్.. ఈయన్ని ముద్దుగా హిట్లర్ 2.0 అని పిలుచుకుంటారు. ఉండేది జానడే అయినా ఆయన చేష్టలు, చర్యలతో అగ్రరాజ్యలను సైతం గడగడలాడించాడు. ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినని వ్యక్తి. ఆఖరికి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను కూడా తన రాజ్యంలోకి రానివ్వలేదు. అంతటి నియంత ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వార్తలొస్తున్నాయి. అయితే నార్త్ కొరియా వర్గాలు ఈ ప్రచారాన్ని కొట్టిపారేసినా.. ప్రపంచ మీడియాలో మాత్రం కిమ్ తర్వాత ఆయన వారసత్వాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారన్న చర్చలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కిమ్ జాంగ్ ఉన్ వారసత్వాన్ని ఆయన సోదరి కిమ్ యో జాంగ్ అందిపుచ్చుకుంటారని ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే ఉత్తర కొరియా దేశంపై కిమ్ యో జాంగ్ పూర్తిగా పట్టు సాధించారని సమాచారం. ఈ మేరకు శత్రు దేశాలకు ఉత్తర కొరియా హెచ్చరికలు కూడా పంపినట్లు తెలుస్తోంది. అన్న కిమ్ జాంగ్ ఉన్ లక్షణాలన్నింటిని చిన్నప్పటి నుంచే ఆయన సోదరి కిమ్ యో జాంగ్ వంటపట్టించుకున్నారట. ఇక ఆ మధ్య ఈమె దక్షిణ కొరియాను కుక్క మొరుగుతోందంటూ హెచ్చరించడం పెద్ద దుమారానికి దారి తీసింది. అంతేకాకుండా ఈమె తన అన్నకిమ్, డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి రెండు సమ్మిట్‌లకు కూడా హాజరయ్యారు. నార్త్ కొరియాను ముందుండి నడిపించేది కిమ్ అయితే.. ఆయనకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ వెనక నుంచి ప్రణాళికలు రచించేది కిమ్ యో జాంగ్ అని అక్కడి రాజకీయ నాయకులు అంటున్నారు. అటు పాలనా వ్యవహారాల్లో కిమ్ ఒక్క తన చెల్లెలు అయిన కిమ్ యో జాంగ్‌ను మాత్రమే నమ్ముతారట. ఇక కిమ్ జాంగ్ ఉన్ కంటే ఆయన సోదరి మరింత డేంజర్ అని ఆ దేశస్థులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈమె హిస్టరీ గురించి తెలుసుకున్న శత్రు దేశాలు మాత్రం గజగజలాడుతున్నాయి.

Also Read:

మనసున్న మారాజు.. పేదవాళ్లకు అద్దె మాఫీ చేసిన టీఆర్ఎస్ నేత..

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!

జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌.. సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా కాలంలో జగన్ మరో కీలక నిర్ణయం..

గుడ్ న్యూస్.. ఫలించిన ప్లాస్మా థెరపీ.. కోలుకున్న కరోనా బాధితుడు..

మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరుచుకోనున్న మద్యం షాపులు.. కానీ..