AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: మిరప తోటలో వింత దొంగతనం.. కాయలన్నీ కోసుకెళ్లిన దుండగులు!

ఖమ్మం జిల్లాలో వింత దొంగతనం చోటుచేసుకుంది. వైరా మండలం రెబ్బవరం గ్రామంలో ఓ రైతు మిరప తోటలోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు చెట్లకు ఉన్న పండిన మిరపకాయలను కోసుకెళ్లారు. గుత్తా నాగరాజుకు చెందిన తోటలో సుమారు మూడు క్వింటాళ్ల మిరపకాయలు చోరీ అయ్యాయి.

Khammam: మిరప తోటలో వింత దొంగతనం.. కాయలన్నీ కోసుకెళ్లిన దుండగులు!
Mirchi Field
N Narayana Rao
| Edited By: |

Updated on: Nov 23, 2026 | 3:36 PM

Share

దొంగతనం అంటే ఇళ్లలోని నగలు, డబ్బులు లేదా పొలాల్లోని పంటను ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కానీ ఖమ్మం జిల్లాలో దొంగలు చేసిన పని మాత్రం రైతును విస్తుపోయేలా చేసింది. చేతికి వచ్చిన పంటను కాపాడుకోవాల్సిన సమయంలో.. ఏకంగా తోటలోకి చొరబడి చెట్లకు ఉన్న మిరపకాయలన్నీ కోసుకెళ్లారు. దీంతో రైతుకు కన్నీళ్లే మిగిలాయి.

ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన గుత్తా నాగరాజు తనకున్న ఎకరం 20 కుంటల భూమిలో మిరప సాగు చేస్తున్నారు. ప్రస్తుతం తోటలో మొదటి విడత పంట కోతకు సిద్ధమైంది. కాయలన్నీ పండి ఎర్రగా మారడంతో మరికొద్ది రోజుల్లో కూలీలను పెట్టి మిరపకాయలు కోయించాలని భావించారు.

ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి మిరప తోటలో మైసమ్మ తల్లికి పాలు పొంగించేందుకు ఉదయం పొలానికి వెళ్లారు. అక్కడికి వెళ్లి చూసేసరికి వారికి ఊహించని దృశ్యం కనిపించింది. తోటలోని ఒక భాగంలో చెట్లకు మిరపకాయలు కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో తోటలోకి ప్రవేశించి పండిన మిరపకాయలను కోసుకెళ్లినట్లు గుర్తించారు.

తోటలో సుమారు మూడు క్వింటాళ్లకు పైగా పండుమిరప కాయలు చోరీకి గురైనట్లు రైతు తెలిపారు. వీటి విలువ దాదాపు రూ.60 వేల వరకు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చే సమయంలో ఇలా జరగడంతో తీవ్రంగా నష్టపోయానని వాపోయారు.

సాధారణంగా పొలాల్లో కోసి ఆరబెట్టిన పంటను దొంగలు ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. కానీ ఈ ఘటనలో ఏకంగా చెట్లకు ఉన్న మిరపకాయలనే కోసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనపై బాధిత రైతు నాగరాజు వైరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న రైతులకు ఇలాంటి ఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

Follow Us