AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ సిక్సర్‌తో బద్ధలైన సొంత కారు అద్దాలు

ఐర్లాండ్‌ క్రికెట్‌ టీమ్‌లో ఆల్‌రౌండర్‌ కెవిన్‌ ఒబ్రియాన్‌ బ్యాటింగ్‌ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎదుర్కొన్న ప్రతీబంతిని బౌండరీ దాటించాలన్న కసితో ఉంటాడతను..

భారీ సిక్సర్‌తో బద్ధలైన సొంత కారు అద్దాలు
Pardhasaradhi Peri
|

Updated on: Aug 29, 2020 | 4:15 PM

Share

ఐర్లాండ్‌ క్రికెట్‌ టీమ్‌లో ఆల్‌రౌండర్‌ కెవిన్‌ ఒబ్రియాన్‌ బ్యాటింగ్‌ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎదుర్కొన్న ప్రతీబంతిని బౌండరీ దాటించాలన్న కసితో ఉంటాడతను.. భారీ షాట్లకు పెట్టింది పేరు! మొన్న గురువారం ఇంటర్‌ ప్రొవిన్షియల్‌ టీ 20 కప్‌ టోర్నమెంట్‌ జరిగింది.. వర్షం కారణంగా మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. లీన్‌స్టర్‌ లైట్నింగ్‌ టీమ్‌ తరఫున బరిలో దిగిన ఒబ్రియాన్‌ ప్రత్యర్థి జట్టు నార్త్‌ వెస్ట్‌ వారియర్స్‌ బౌలర్లను చితకబాదేశాడు. 37 బంతుల్లోనే ఎనిమిది భారీ సిక్సర్లతో 82 పరుగులు చేశాడు.. ఆ ఎనిమిది సిక్సర్లలో ఒకటి అతి భారీ సిక్సర్‌.. ఎంతగా అంటే బంతి స్టేడియం అవతల పడేటంత! స్టేడియం ఆవతలికి రయ్యిమంటూ దూసుకెళ్లిన ఆ బంతి నేరుగా వెళ్లి ఒబ్రియాన్‌ కారు అద్దాలనే పగలకొట్టింది.. ఆ భారీ షాట్‌కు మురిసిపోవాలో లేక కారు అద్దం బద్దలయ్యిందని దిగాలు పడాలో అర్థం కాని పరిస్థితి ఒబ్రియాన్‌ది! ధ్వంసమైన కారు ఫొటోను ఐర్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ట్విటర్‌లో పోస్టు చేసింది. దీనికి కౌంటర్‌ ట్వీట్‌ కూడా ఇచ్చారు ఒబ్రియాన్‌.. ఇంటికెళ్లేటప్పుడు తనకు ఏసీ అవసరం లేదనుకుంటా అంటూ చమత్కరించాడు.. ఇక నుంచి ఆట ఆడుతున్నప్పుడు కారును కాసింత దూరంగా పార్క్‌ చేస్తానన్నాడు కెవిన్‌ ఒబ్రియాన్‌.. ఎంతైనా డాషింగ్ బ్యాట్స్‌మన్‌ కదా! అందుకే కారు సర్వీస్‌ సెంటర్‌ వాళ్లు ఫ్రీగానే కొత్త అద్దాన్ని ఫిక్స్‌ చేసి ఇచ్చారు.

Follow Us
కళ్లముందే రాయిలా మారే జీవి.. సముద్రపు మాయగాడు ఆక్టోపస్ రహస్యాలు..
కళ్లముందే రాయిలా మారే జీవి.. సముద్రపు మాయగాడు ఆక్టోపస్ రహస్యాలు..
న్ బౌల్డ్ చేసినా వికెట్ దక్కలేదు.. ట్విస్ట్ ఇచ్చిన అంపైర్..!
న్ బౌల్డ్ చేసినా వికెట్ దక్కలేదు.. ట్విస్ట్ ఇచ్చిన అంపైర్..!
మంచంలోనే ప్రాణాలు విడిచిన ఆరు నెలల పసికందు!
మంచంలోనే ప్రాణాలు విడిచిన ఆరు నెలల పసికందు!
JEE Advanced 2027 షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌..! రాత పరీక్ష ఎప్పుడంటే
JEE Advanced 2027 షెడ్యూల్‌ వచ్చేసిందోచ్‌..! రాత పరీక్ష ఎప్పుడంటే
అక్టోబర్ 1 నుంచి వీటి ధరల్లో భారీ మార్పులు.. కొనాలంటే కష్టమే..
అక్టోబర్ 1 నుంచి వీటి ధరల్లో భారీ మార్పులు.. కొనాలంటే కష్టమే..
GATE 2027 దరఖాస్తులకు చివరి అవకాశం.. మరికొన్ని గంటలే ఛాన్స్!
GATE 2027 దరఖాస్తులకు చివరి అవకాశం.. మరికొన్ని గంటలే ఛాన్స్!
ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్..!
ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్..!
ఒంటి చేత్తో గాల్లో ఆ క్యాచ్ ఏంటి భయ్యా.. వీడియో చూస్తే అవాక్కే..!
ఒంటి చేత్తో గాల్లో ఆ క్యాచ్ ఏంటి భయ్యా.. వీడియో చూస్తే అవాక్కే..!
మాటలు కోటలు దాటుతాయి.. చేతలు మాత్రం గడప దాటవ్.. కోతి ఉపవాసం కథ
మాటలు కోటలు దాటుతాయి.. చేతలు మాత్రం గడప దాటవ్.. కోతి ఉపవాసం కథ
ప్రైవేట్ వీడియో లీక్.. 4 రోజులు ఇంట్లోనే ఉండిపోయా.. హీరోయిన్..
ప్రైవేట్ వీడియో లీక్.. 4 రోజులు ఇంట్లోనే ఉండిపోయా.. హీరోయిన్..