ఆదినారాయణరెడ్డి, శ్రీచైతన్య యాజమాన్యం తన ఆస్తుల్ని కబ్జా చేసిందంటూ కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ కేశవరెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించిన కొద్ది సేపటికే ఆయన కుమారుడు భరత్ రెడ్డి రంగంలోకి దిగారు. “మా నాన్నకేశవరెడ్డి ఇవాళ చేసిన కామెంట్స్ వాస్తవం కాదు. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. 2014లో మా నాన్న చేసిన ఆర్థిక సమస్యల వల్ల ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మా సంస్థను శ్రీచైతన్య ఆదుకుంది. శ్రీచైతన్య యాజమాన్యం ఎలాంటి కబ్జా చేయలేదు. కేశవరెడ్డి విద్యాసంస్థలను కాపాడింది కేవలం శ్రీచైతన్య యాజమాన్యం. మా నాన్న చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజాయతీ లేదు. నన్ను ఇలా మాట్లాడమని ఎవరూ బెదిరించలేదు. మా నాన్న చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నేను మా కుటుంబసభ్యులతో చర్చించి వీడియో విడుదల చేస్తున్నాను.” అంటూ భరత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
వియ్యంకుడిపై రెచ్చిపోయిన కేశవరెడ్డి విద్యాసంస్థల ఛైర్మన్