కేరళలో పది వేలకు చేరువలో కరోనా కేసులు

కరోనా ప్రభంజనానికి దేశం విలవిలలాడుతోంది. తక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో సైతం కొత్త కేసులు గణనీయం పెరుగుతున్నాయి. కేరళలో రోజుకు 600కు పైగా కేసులు నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. ఇవాళ ఒక్కరోజే కేరళలో 623 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు సీఎం పినరయ్ విజయన్ ప్రకటించారు.

కేరళలో పది వేలకు చేరువలో కరోనా కేసులు

Updated on: Jul 15, 2020 | 8:06 PM

కరోనా ప్రభంజనానికి దేశం విలవిలలాడుతోంది. తక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో సైతం కొత్త కేసులు గణనీయం పెరుగుతున్నాయి. కేరళలో రోజుకు 600కు పైగా కేసులు నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. ఇవాళ ఒక్కరోజే కేరళలో 623 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు సీఎం పినరయ్ విజయన్ ప్రకటించారు.

ఒక్క తిరువనంతపురంలోనే ఇవాళ కొత్తగా 157 కరోనా కేసులు నమోదయినట్లు తెలిపారు. దీంతో.. కేరళలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,553కు చేరిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4,880 యాక్టివ్ కేసులతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో కేరళలో 16,444 శాంపిల్స్ టెస్ట్ చేశామని సీఎం వెల్లడించారు.

ఇక జిల్లాల వారీగా నమోదయిన కేసులను పరిశీలిస్తే.. తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా 157, కసరగడ్ జిల్లాలో 74, ఎర్నాకులం జిల్లాలో 72, కొజికొడె జిల్లాలో 64, పాతనంతిట్ట 64, ఇడుక్కి 55, కన్నూర్ 35, కొట్టాయం 25, అలప్పుజ 20, పాలక్కడ్ 19, మలప్పురం 18, కొల్లాం 11, త్రిసూర్ 5, వయనాడ్ జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి.