Keerthy Suresh: పెద్దన్నలో కీర్తిసురేష్ పాత్రపై క్లారిటీ వచ్చేసింది.. పూర్తి వివరాలివే..

|

Oct 28, 2021 | 11:47 AM

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'అన్నాత్తై'. తెలుగులో 'పెద్దన్న' పేరుతో విడుదల కానుంది. . ఈ..

Keerthy Suresh: పెద్దన్నలో కీర్తిసురేష్ పాత్రపై క్లారిటీ వచ్చేసింది.. పూర్తి వివరాలివే..
Follow us on

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘అన్నాత్తై’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదల కానుంది. . ఈ సినిమాలో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్‌ వంటి అందాల తారలు సూపర్‌ స్టార్‌తో కలిసి స్ర్కీన్ షేర్‌ చేసుకోనున్నారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ వారి అంచనాలను మరింత రెట్టింపు చేసింది. టైటిల్ కు తగ్గట్లే ఈ సినిమా అన్నా- చెల్లెళ్ల కథతో కూడుకుందని తెలుస్తోంది. ఇక మొదటి నుంచి వినిపిస్తున్నట్లే కీర్తి సురేష్‌ ఈ సినిమాలో సూపర్‌స్టార్‌ సోదరిగా కనిపించనుంది.

‘దేవుడు నాకు ప్రసాదించే ఐశ్వర్యం, సంపద అన్నింటినీ నా చెల్లెలికే ఇవ్వండి’, ‘చెల్లాయ్.. ఈ అన్నయ్యను తలచుకున్నావమ్మా’ అని కీర్తిని చూస్తూ రజనీకాంత్ చెప్పిన డైలాగులు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. కష్టాల్లో ఉన్న తన చెల్లిని కాపాడుకోవడానికి ఒక ఊరి పెద్ద ఏం చేశాడు? ఎంతదాకా వెళ్లాడు? అన్న కథతో ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. సూపర్‌ స్టార్‌తో పాటు తెలుగులో చిరంజీవి పక్కన కూడా చెల్లెలిగా నటించనుంది కీర్తి. ‘వేదాళం’ రీమేక్‌గా రూపొందనున్న ‘భోళా శంకర్‌’ సినిమాలో మెగాస్టార్‌ సిస్టర్‌గా ఎంపిక చేసినట్లు కొద్ది రోజుల క్రితమే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓవైపు ‘సర్కారు వారి పాట’, ‘గుడ్‌ లక్‌ సఖి’, ‘మరక్కార్‌’ వంటి సినిమాల్లో కథానాయికగా నటిస్తోన్న కీర్తి..మరోవైపు సీనియర్‌ హీరోలకు సోదరిగా కూడా కనిపించడం ఆశ్చర్యకరమని చెప్పుకోవచ్చు.

Also Read:

Katrina Kaif: త్వరలో ప్రియుడు విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకోనున్న కత్రినా కైఫ్.. వివాహ వేడుక ఎప్పుడు? ఎక్కడంటే?

Allu Arjun: చిత్ర పరిశ్రమకు అమ్మాయిలు రావాలి: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

Ajith: బైక్ పై భారత్-పాకిస్థాన్ బోర్డర్ వరకూ వెళ్లిన అజిత్.. వీడియో