వంట‌ల‌క్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…

|

Apr 01, 2020 | 10:12 PM

కార్తీకదీపం సీరియ‌ల్ గురించి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం రేటింగ్స్ ప‌రంగా కార్తీకదీపం దుమ్మురేపుతోంది. స్టార్ హీరోల సినిమాలు తొలిసారి ప్లే అయిన‌ప్పుడు, కీల‌క‌మైన క్రికెట్ మ్యాచ్ లు కూడా దాటి రేటింగ్స్ లో స‌త్తా చాటుతోంది. ముఖ్యంగా ఈ సీరియ‌ల్ లో కీల‌క పాత్ర పోషిస్తోన్న వంట‌ల‌క్క‌కు ఉన్న ఫ్యాన్ బేస్ అయితే వ‌ర్ణ‌ణాతీతం. అయితే, ఈ సీరియ‌ల్ ను మొద‌టి నుంచి ఫాలో అవ్వ‌నివాళ్ల‌కు ఓ గుడ్ న్యూస్. ప్రస్తుతం […]

వంట‌ల‌క్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్...
Follow us on

కార్తీకదీపం సీరియ‌ల్ గురించి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం రేటింగ్స్ ప‌రంగా కార్తీకదీపం దుమ్మురేపుతోంది. స్టార్ హీరోల సినిమాలు తొలిసారి ప్లే అయిన‌ప్పుడు, కీల‌క‌మైన క్రికెట్ మ్యాచ్ లు కూడా దాటి రేటింగ్స్ లో స‌త్తా చాటుతోంది. ముఖ్యంగా ఈ సీరియ‌ల్ లో కీల‌క పాత్ర పోషిస్తోన్న వంట‌ల‌క్క‌కు ఉన్న ఫ్యాన్ బేస్ అయితే వ‌ర్ణ‌ణాతీతం. అయితే, ఈ సీరియ‌ల్ ను మొద‌టి నుంచి ఫాలో అవ్వ‌నివాళ్ల‌కు ఓ గుడ్ న్యూస్.

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో… అన్ని సినిమా, సీరియల్స్ షూటింగ్స్ కంప్లీట్ గా ఆగిపోయాయి. దీంతో బ్యాక‌ప్ పెట్టిన ఎపిసోడ్స్ కూడా అయిపోవ‌డంతో..అన్ని సీరియ‌ల్స్ ను మొద‌ట్నుంచి రీ టెలికాస్ట్ చెయ్య‌డం ప్రారంభించారు. కార్తీకదీపం సీరియల్ ప్ర‌జంట్ తిరిగి ప్ర‌సార‌మ‌వుతోంది. దీంతో మొద‌ట్నుంచి సీరియ‌ల్ ఫాలో అవ్వ‌ని వాళ్ల‌కి.. డాక్టర్ బాబుకి, వంటలక్కకి మధ్య పరిచయం ఎలా? వారిద్దరూ ఎప్పుడు..ఎందుకు..ఎలా కలిశారు? ? అస‌లు గ‌తంలో జ‌రిగిన అంశాలు ఏంటి అని చాలామందికి యాంగ్జైటీ ఉంటుంది. ఇప్పుడు ఆ విష‌యాల్నీ తెలుసుకోవ‌చ్చు. లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటుంది అనేదాన్ని బ‌ట్టి ఎపిసోడ్స్ ప్లే అవుతాయి. లాక్ డౌన్ కాలం ముగిసి.. షూటింగ్ చేసి, ఎడిటింగ్, డ‌బ్బింగ్ కంప్లీట్ అయ్యేవ‌ర‌కు చాలాసమ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. అప్పటి వరకు ఆపాత ఎపిసోడ్స్ ను చూసి ఎంజాయ్ చేయెచ్చు.