కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తివేంద్రసింగ్ రావత్.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఈ ఏడాది కన్వాడ్ యాత్రను కరోనా సంక్షోభం కారణంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శనివారం మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్‌లో యాత్ర సాధ్యాసాధ్యాలపై చర్చించారు.
కోవిద్-19 కట్టడికోసం యాత్రను వాయిదా వేయాలని సమావేశంలో ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకోగా కన్వాడ్ సంఘ్‌లు, సెయింట్ మహాత్మాలు నిర్ణయాన్ని సమర్దించాయి. ఇదే విషయంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రావత్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోనూ చర్చించారు. యాత్ర కంటే కరోనా నియంత్రణే ముఖ్యమని, జనం ఒకేచోట గుమిగూడకుండా చూడడం ముఖ్యమన్న అభిప్రాయాన్ని అమిత్‌షా ఎదుట వెలిబుచ్చారు. త్వరలో ఇదే విషయంపై రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.
Also Read: కరోనా కట్టడకోసం ‘కఫసుర’.. ఐదు రోజుల్లోనే..