కాణిపాకంలో ప్రమాణానికి రెడీనా? కన్నా ఛాలెంజ్
ఏపీలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య మరీ ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్దం పీక్ లెవెల్‌కు చేరింది. ఎంతవరకు అంటే ఏకంగా కాణిపాకం దేవాలయంలో...

95ఏపీలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య మరీ ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్దం పీక్ లెవెల్‌కు చేరింది. ఎంతవరకు అంటే ఏకంగా కాణిపాకం దేవాలయంలో ప్రమాణానికి ఛాలెంజ్ చేసుకునేంతటి స్థాయికి కన్నా, విజయసాయి మధ్య వాగ్వాదం వెళ్ళింది. ఇందుకు రాపిడ్ టెస్టు కోసం ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన కిట్లు, వాటికి ఖరారు చేసిన ధరలు.
ఒక్కో కిట్‌ను చత్తీస్‌గఢ్ ప్రభుత్వం 337 రూపాయలకు కొనుగోలు చేస్తే అవే కిట్లను, అదే సంస్థ నుంచి ఏపీ ప్రభుత్వం 735 రూపాయలకు కొనుగోలు చేసిందని కన్నా ఇటీవల ఆరోపించారు. ఇంత తేడా ఎందుకు? ఎవరికైనా ముడుపులు అందాయా అన్నది కన్నా ప్రశ్న. ఈ ఆరోపణలపై స్పందించిన విజయసాయిరెడ్డి.. కన్నా వంటి చంద్రబాబుకు అమ్ముడుపోయిన బీజేపీ నేతలు చేసే ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. కన్నా, సుజనా వంటి నేతలు బీజేపీ వారు కాదని, వారంతా తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేసే తెలుగు జాకాల్స్ పార్టీ (టీజేపీ) నేతలని ఘాటైన విమర్శలు చేసేశారు.
దేశవ్యాప్తంగా మోదీ గారి ఇమేజి పెరిగినా రాష్ట్రంలో ఆ పార్టీ ఎదగక పోవడానికి బాబుకు అమ్ముడు పోయిన కన్నాలాంటి వారే కారణం. బాబు ప్యాకేజి ఆఫర్ ఎలాగుంటుందంటే రాజకీయంగా అవసాన దశలో ఉన్నవారినీ లేపి కూర్చోపెడుతుంది. మొదటి నుంచి బిజెపిలో ఉన్న వారు కన్నాలాంటి జంబూకాలను వదిలించుకోవాలి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 20, 2020
‘‘దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ఇమేజ్ పెరిగినా రాష్ట్రంలో ఆ పార్టీ ఎదగకపోవడానికి చంద్రబాబుకు అమ్ముడుపోయిన కన్నా లాంటివారే కారణమని’’ సోమవారం ట్వీట్ చేశారు. ‘‘బాబు ప్యాకేజీ ఆఫర్ అవసాన దశలో ఉన్నవారినీ లేపి కూర్చోపెడుతుంది. మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారు… కన్నాలాంటి జంబూకాలను వదిలించుకోవాలి’’ అని సూచించారు.
‘‘మళ్లీ అడుగుతున్నా…కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? లేదా? టీజేపీ (టీడీపీ జాకాల్స్ పార్టీ) వారు కాకుండా బీజేపీ వారు నా మీద విమర్శలు చేస్తే సమాధానం ఇస్తా.’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
తాజాగా తాను చంద్రబాబుకు అమ్ముడుపోయినట్లుగా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లపై కన్నా సీరియస్ అయ్యారు. తనను కొనే స్థాయి నేత ప్రస్తుతం భూమ్మీద లేడని వ్యాఖ్యానించిన కన్నా.. తాను కాణిపాకం దేవాలయంలో ప్రమాణానికి సిద్దమని, తనతోపాటు ప్రమాణానికి మగాడైతే విజయసాయిరెడ్డి కూడా రెడీ కావాలని కన్నా లక్ష్మీనారాయణ ఛాలెంజ్ చేశారు. తాజాగా కన్నా చేసిన కామెంట్లపై విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారనేదిపుడు ఆసక్తికరంగా మారింది.
