బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు అత్యాచార బెదిరింపులు వచ్చాయి..ఫేస్‌బుక్‌లో కంగనాను ఉద్దేశించి ఇలాంటి నీచమైన కామెంట్ పెట్టింది ఓ లాయర్! ఆయనే తర్వాత తన ఫేస్‌బుక్ హ్యాక్ అయ్యిందని చెప్పుకొచ్చారు.. వ్యవసాయ చట్టాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కంగానపై క్యతాసంద్ర పోలీసుస్టేషన్‌లో కంగనాపై ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది.. అలాగే బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశం మేరకు ముంబాయి పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసు కింద మరో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.. వీటిపై కంగనా ట్విట్టర్‌లో సర్కాస్టిక్‌గా స్పందించారు.. ఆపై తన సోదరుడి పెళ్లి వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసుకున్నారు.. దీని తర్వాతే ఒడిశాకు చెందిన ఓ న్యాయవాది కంగనాపై అత్యాచార బెదిరింపులు చేశారు. నడిరోడ్డుపై రేప్ చేస్తానని ఆయన పెట్టిన కామెంట్ చూసి నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. అయితే తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్‌కు గురయ్యిందని సదరు న్యాయవాది చెప్పుకొచ్చారు.. తనకు స్త్రీలు, సమాజం పట్ల గౌరవం ఉందని, తన అకౌంట్ నుంచి వచ్చిన అసభ్యకరమైన కామెంట్లు ఎవరినైనా నొప్పిస్తే అందుకు క్షంతవ్యుడిని అని పోస్టు పెట్టారు. ఆ పోస్టు పెట్టిన తర్వాత తన ఫేస్‌బుక్ అకౌంట్ డిలీట్ చేశారు.. ప్రస్తుతం మనాలిలో ఉన్న కంగనా ఇప్పటి వరకు ఈ కామెంట్‌పై స్పందించలేదు..