కమలా హారిస్ ప్రెస్ సెక్రెటరీగా సబ్రినా సింగ్ నియామకం

అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ నామినీగా ఎన్నికైన కమలా హారిస్ తన ప్రెస్ సెక్రెటరీగా 32 ఏళ్ళ ఇండియన్-అమెరికన్ సబ్రినా సింగ్ ని నియమించుకున్నారు. సబ్రినా లోగడ..

కమలా హారిస్ ప్రెస్ సెక్రెటరీగా సబ్రినా సింగ్ నియామకం

Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 17, 2020 | 4:18 PM

అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ నామినీగా ఎన్నికైన కమలా హారిస్ తన ప్రెస్ సెక్రెటరీగా 32 ఏళ్ళ ఇండియన్-అమెరికన్ సబ్రినా సింగ్ ని నియమించుకున్నారు. సబ్రినా లోగడ.. ఇద్దరు డెమొక్రాట్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థులైన న్యూజర్సీ సెనెటర్ కోరీ బుకర్ కి, న్యూయార్క్ మాజీ మేయర్ మైక్ బ్లూమ్ బెర్గ్ కి ప్రెస్ సెక్రటరీలుగా వ్యవహరించారు. కమలా హారిస్ తనను ఈ పదవిలో నియమించినందుకు సబ్రినా సింగ్ హర్షం వ్యక్తం చేస్తూ.. తాను ప్రచారంలో ఆమె వెంటే ఉంటానని, నవంబరు ఎన్నికల్లో విజయం కోసం వేచి చూస్తున్నానని పేర్కొన్నారు.

లాస్ ఏంజిలిస్ లో నివసించే ఈమె లోగడ డెమొక్రాట్ నేషనల్ కమిటీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు.

 

Also Read: