Kamal reaction on Rajini’s announcement: ఎంతో మంది అభిమానులను నిరాశపరుస్తూ సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ అరంగేట్రంపై వెనుకడుగు వేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31న తన పార్టీ గురించి ప్రకటన చేయాల్సి ఉండగా.. ఉన్నట్లుండి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో.. కూతుళ్ల ఒత్తిళ్ల మేరకు రజినీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే రజినీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రజినీ అభిమానులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఈ విషయమై స్పందించారు. తాజాగా రజినీ కాంత్ స్నేహితుడు, సహనటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ రజీని నిర్ణయంపై స్పందించారు. ‘రజినీకాంత్ రాజకీయాలపై తీసుకున్న నిర్ణయంతో ఆయన అభిమానులతోపాటు నేనూ చాలా నిరాశ చెందాను. కానీ నాకు ఆయన ఆరోగ్యమే ముఖ్యం. రజినీకాంత్ ఎక్కడ ఉన్నా బాగుండాలి’ అంటూ చెప్పుకొచ్చారు.
Also read: యూటర్న్ తీసుకున్న రజినీకాంత్.. తలైవా ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశే..పార్టీ ఏర్పాటుపై మూడు పేజీల ప్రకటన