Justice For Nirbhaya: దేశ రాజధాని ఢిల్లీలో సంబరాలు మిన్నంటాయి. ఏడేళ్ల క్రితం పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు దోషులైన ముఖేష్ కుమార్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మలకు తీహార్ జైలు అధికారులు శుక్రవారం తెల్లవారు జామున ఉరిశిక్షను అమలు చేశారు. మూడో నెంబర్ జైలులో తలారీ పవన్ ఈ నలుగురిని ఒకేసారి ఉరి తీశారు.
ఈ క్షణం కోసం నిర్భయ తల్లిదండ్రులు మాత్రమే కాదు.. యావత్ భారతదేశం ఎదురుచూసింది. ఆశాదేవి అయితే 2013 నుంచి ఇప్పటివరకు తన కూతురుకు అన్యాయం జరిగిన దానికే కాకుండా.. ఈ దుస్థితి ఎవరికి రాకూడదు అనే ఉద్దేశంతో ఓ యోధురాలిగా పోరాటం చేసింది. ఇక ఆమె వెంట అండగా ఉంటూ.. వారి తరపున న్యాయస్థానాల్లో పోరాడిన మహిళా న్యాయవాది పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకవైపు న్యాయవ్యవస్థలోని లొసుగులను అడ్డుపెట్టుకుంటూ తమ శిక్షను వాయిదా వేసుకుంటూ వచ్చిన దోషులను ఎలాగైనా ఉరికంబం ఎక్కేవరకు వదిలిపెట్టలేదు ఈ మహిళా న్యాయవాది. ఉరిశిక్ష వాయిదా పడిన ప్రతీసారి నిర్భయ తల్లి వెన్నంటి ఉంటూ.. ఆమెలో ధైర్యాన్ని నింపుతూ పోరాటాన్ని సాగించింది. ఇక ఆమెవరో కాదు సీమా ఖుష్వాహ.
2012లో నిర్భయపై అత్యాచారం జరిగిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల దగ్గర నుంచి సీమా ఖుష్వాహ ఆశాదేవి కుటుంబానికి అండగా ఉంటూ వచ్చారు. ఎఫ్ఐఆర్, దోషులపై ఛార్జ్‌షీట్ నమోదు చేయడం, వగైరా విషయాలన్నింట్లోనూ ఆమె ముద్ర అడుగడుగునా కనిపిస్తుంది. ఢిల్లీ హైకోర్టులో ఈ కేసుపై సమర్ధవంతంగా వాదించిన ఈమె ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదు. కేవలం తన స్నేహితురాలికి సాయం చేస్తున్నానని అనుకుంది. ఇక చివరికి దోషులకు ఉరి వేయడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. కాగా, సీమా ఖుష్వాహా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యురాలుగా ఉన్న సీమా ఈ కేసులో సుప్రీంకోర్టు వరకు వెళ్లారు.
For More News:
వారిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలట.. దోషుల తరపు లాయర్
నా కుమార్తె ఫొటోను కౌగలించుకున్నా: నిర్భయ తల్లి భావోద్వేగం
Breaking… నిర్భయ దోషులకు ఉరి అమలు…
Breaking: భారత్‌లో ఐదో కరోనా మరణం..
నిర్భయ ‘ఆశ’ల పోరాటానికి హ్యాట్సాఫ్..!
కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే
కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…
Breaking: ఏపీలో రెండో కరోనా పాజిటివ్ కేసు..
కరోనా భయం.. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వేల కోళ్లు సజీవ సమాధి..