సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు

| Edited By:

Aug 09, 2019 | 4:25 PM

నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్‌సీ) బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాకర్లు ఏపీలో సమ్మెను విరమించారు. జూడాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఎమ్‌సీ బిల్లుతో వైద్యరంగం బలహీనమవుతుందని జూనియర్ డాకర్లు ఆందోళన నిర్వహించారు. అయితే గత రెండు రోజులుగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులతో 13 జిల్లాలకు చెందిన జూనియర్ వైద్యుల ప్రతినిధులు […]

సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
Follow us on

నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్‌సీ) బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాకర్లు ఏపీలో సమ్మెను విరమించారు. జూడాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఎమ్‌సీ బిల్లుతో వైద్యరంగం బలహీనమవుతుందని జూనియర్ డాకర్లు ఆందోళన నిర్వహించారు. అయితే గత రెండు రోజులుగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులతో 13 జిల్లాలకు చెందిన జూనియర్ వైద్యుల ప్రతినిధులు చర్చలు జరిపారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు సమ్మెను విరమించారు. ఇదిలా ఉంటే గురువారం రాష్ట్రపతి ఎన్ఎమ్‌సీ బిల్లుకు ఆమెదముద్రను వేశారు.