రైతు బంధు: బ్యాంకు ఖాతాలు ఇవ్వని రైతులు జులై 5లోపు ఇవ్వాలి..

కరోనా సంక్షోభ సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పధకంలో భాగంగా వానాకాలం, 2020సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకూ 56,94,185 మంది

రైతు బంధు: బ్యాంకు ఖాతాలు ఇవ్వని రైతులు జులై 5లోపు ఇవ్వాలి..

Edited By:

Updated on: Jul 04, 2020 | 6:21 AM

Proper documents for Rythu Bandhu: కరోనా సంక్షోభ సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పధకంలో భాగంగా వానాకాలం, 2020సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకూ 56,94,185 మంది రైతులకు రూ. 7183.67 కోట్ల రూపాయలను ఆన్‌లైన్‌ద్వారా వారి ఖాతాలకు నేరుగా జమచేసినట్టు వ్యవసాయశాఖ కమిషనర్‌ డాక్టర్‌ బి.జనార్ధన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకూ బ్యాంకు ఖాతాలు ఇవ్వని రైతులు, జూలై 5వతేదీలోపు సంబంధిత వ్యవసాయవిస్తరణ అధికారి వద్ద తమ వివరాలను నమోదుచేసుకోవాలని సూచించారు.

రాష్ట్ర వ్యవసాయశాఖ వద్ద 34,860 మంది రైతుల బ్యాంకుఖాతాల వివరాలు సరిగ్గాలేకపోవడం వల్ల వారి ఖాతాలకు రైతుబంధు డబ్బులు చేరలేదన్నారు. వారికి డబ్బులు జమచేసినా సరైన ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌ లేకపోవడం, మూసి వేసినఖాతాలు ఇవ్వడం, సరైన ఖాతాలు ఇవ్వకపోవడం వల్ల నిధులు జమ కాలేదన్నారు.

Also Read: ముంబైలో భారీ వర్షాలు.. పురాతన భవనాలకు ముప్పు..