కర్ణాటక దేవదుర్గ బీజేపీ ఎమ్మెల్యే శివానగౌడ నాయక్ ఓ కేసు విషయమై కోర్టు వెళ్లారు. అక్కడ ఆయనకు ఛేదు అనుభవం ఎదురైంది. ఓ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరైన ఆయన హాల్లో పదేపదే నవ్వడాన్ని గమనించిన జడ్జ్ సీరియస్ అయ్యారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి కోర్టులో ఎలా వ్యవహరించాలో తెలియదా..? అని ప్రశ్నించారు. దీంతో.. కాసేపు కోర్టు కస్టడీలోనే ఉండాలని మందలించారు. కాగా.. దీంతో ఎమ్మెల్యే శివానగౌడ నాయక్ న్యాయవాదులు జోక్యం చేసుకుని తమ క్లయింట్ చేసింది తప్పేనని, ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని.. న్యాయమూర్తికి విన్నవించడంతో ఆయన శాంతించారు.