జొన్నవిత్తుల దర్శకత్వంలో “ఆర్జీవి”

ఈ సారి ఆర్జీవీ ఒకరిని టార్గెట్ చేస్తే...ఆయనను మరొకరు టార్గెట్ చేశారు. అంతా రివర్స్ గేర్..  కార్తికేయ చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం సమర్పణలో, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల.....

  • Sanjay Kasula
  • Publish Date - 5:20 am, Fri, 24 July 20
జొన్నవిత్తుల దర్శకత్వంలో "ఆర్జీవి"

రామ్ గోపాల్ వర్మ అంటేనే.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్. అంతే కాదు వివాదానికి మారు పేరు. కాంట్రవర్శీ అంటే ఏమిటో తెలియదు అంటూనే.. దానితోనే సహజీవనం చేసే పేరు ఆర్జీవీ. ఆయన ఓ టైమ్ బాంబ్ లాంటివాడు.. సరిగ్గా సమయం చూసుకుని మరీ సినిమాలను పేల్చుతుంటాడు. ట్వీట్స్‌లాగే ఆయన లైఫ్ స్టయిల్‌ను కూడా అచ్చం అలానే ఉంటుంది. ఇక ఆర్జీవీ టచ్ చేస్తున్నాడు అంటే చాలు.. అది గ్యారంటీగా అది రచ్చ రంబోలా .

సినిమా ముసుగులో కొందరు వ్యక్తులను టార్గెట్ చేస్తూ.. ఆయన చేస్తున్న రచ్చ.. రోజూ మాట్లాడుకునేదే. అయితే ఈ సారి ఆర్జీవీ ఒకరిని టార్గెట్ చేస్తే…ఆయనను మరొకరు టార్గెట్ చేశారు. అంతా రివర్స్ గేర్..  కార్తికేయ చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం సమర్పణలో, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో, మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్న “ఆర్జీవి” ‘రోజూ గిల్లే వాడు‌.

ఈ చిత్రం కోసం గిన్నీస్ వరల్డ్ రికార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ వీణాపాణి స్వరపరచగా రేవంత్ ఆలపించిన ‘వోడ్కా మీద ఒట్టు నేన్ బాడ్కావ్ నాకొడుకు ని’ అనే పాట లిరికల్ వీడియో జులై 24 సాయంత్రం 6.30 నిమిషాలకు విడుదల చేస్తున్నామని ఆర్జీవీ చిత్రబృందం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియజేసింది.