అమెరికా అధ్యక్షునిగా ఈ నెల 20 న ప్రమాణ స్వీకారం చేసే రోజున జో బైడెన్ సుమారు డజను ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నారు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితి, క్షీణించిన ఆర్ధిక వ్యవస్థ, క్లైమేట్ ఛేంజ్, జాతి వివక్ష పరిష్కారం.. ఈ నాలుగు ప్రధాన అంశాలపై ఆయన ఫోకస్ పెడతారని వైట్ హౌస్ కొత్త చీఫ్ రాన్ క్లెయిన్ వెల్లడించారు. ఈ నాలుగు అత్యవసరంగా పరిష్కరించాల్సినవి అని పేర్కున్నారు. పదవి చేబట్టిన మొదటి 10 రోజుల్లో బైడెన్ వీటికి ప్రాధాన్యంఇఛ్చి ఇతర విషయాలను పక్కన పెడతారని అన్నారు. ఇటీవల బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల భారీ ఎకనామిక్ ప్యాకేజీని ప్రకటించారు. ముఖ్యంగా కోవిడ్ సమస్య పరిష్కారంతో బాటు ఆర్ధిక వ్యవస్థ పునరుజ్జీవనానికి ఆయన ఈ ప్యాకేజీలో ఎక్కువ నిధులను కేటాయించారు. కొన్ని ముస్లిం మెజారిటీ దేశాల నంచి ప్రజలను అమెరికాలోకి రాకుండా ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను బైడెన్ ఉపసంహరించే అవకాశాలున్నాయి.
ఇక సెనేట్ లో ట్రంప్ విచారణకు, తన కేబినెట్ సహచరుల ఎంపికకు మధ్య సభ కొంతసేపు సమయాన్ని కేటాయించాలని బైడెన్ భావిస్తున్నారు. బైడెన్ విజయంపై ట్రంప్ ఇప్పటివరకు ఆయనను అభినందించలేదు. తన ఓటమిని ఆయన పరోక్షంగా అంగీకరించారు. వైట్ హౌస్ ను అయిష్టంగా వీడేందుకు సిధ్దపడుతున్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం.. కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా.. ఒకరు మృతి 17 మందికి గాయాలు..
ఆ పానెల్ లోని ఇతర సభ్యులను తొలగించండి, సుప్రీంకోర్టును కోరిన రైతు సంఘం, అఫిడవిట్ సమర్పణ
Loan Apps News: గూగుల్ కీలక నిర్ణయం.. సుమారు 200 లోన్ యాప్స్ ప్లేస్టోర్‌లో తొలగింపు..