Loan Apps News: గూగుల్ కీలక నిర్ణయం.. సుమారు 200 లోన్ యాప్స్ ప్లేస్టోర్‌లో తొలగింపు..

Loan Apps News: ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కొరడా ఝుళిపించింది. గత కొద్దిరోజులుగా లోన్ యాప్స్‌పై...

Loan Apps News: గూగుల్ కీలక నిర్ణయం.. సుమారు 200 లోన్ యాప్స్ ప్లేస్టోర్‌లో తొలగింపు..
Follow us

|

Updated on: Jan 17, 2021 | 9:16 AM

Loan Apps News: ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కొరడా ఝుళిపించింది. గత కొద్దిరోజులుగా లోన్ యాప్స్‌పై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. దీనితో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే రుణ గ్రహీతలను వేధిస్తున్న సంస్థలకు చెందిన ఆన్‌లైన్ లోన్ యాప్స్‌ను తొలగించాలంటూ గూగుల్ సంస్థకు లేఖ రాశారు.

ఇక పోలీసుల విజ్ఞప్తి మేరకు గూగుల్.. తమ ప్లేస్టోర్ నుంచి లోన్ యాప్స్‌ను తొలగించడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సుమారు 200కు పైగా యాప్స్‌ను తొలగించింది. మరిన్ని యాప్స్‌ను సైతం తొలగించాలని పోలీసులు సంస్థను కోరగా.. ఆ మేరకు చర్యలు చేపడతామని గూగుల్ స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే ఇప్పటికే లోన్ యాప్స్ వ్యవహారంలో పోలీసులు వందల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. అంతేకాకుండా నలుగురు చైనా దేశస్తులను అరెస్ట్ చేశారు. అలాగే లోన్ యాప్స్ బాధితులు డయల్ 100, లేదా సమీప పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని.. ఎలాంటి బలవన్మరణాలకు పాల్పడకూడదని పోలీసులు సూచిస్తున్నారు.