ఆ పానెల్ లోని ఇతర సభ్యులను తొలగించండి, సుప్రీంకోర్టును కోరిన రైతు సంఘం, అఫిడవిట్ సమర్పణ

తమ డిమాండ్ల సమస్యపై తలెత్తిన సంక్షోభ పరిష్కారానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని మిగతా ముగ్గురు సభ్యులను తొలగించాలని భారతీయ కిసాన్ యూనియన్..

ఆ పానెల్ లోని ఇతర సభ్యులను తొలగించండి, సుప్రీంకోర్టును కోరిన రైతు సంఘం, అఫిడవిట్ సమర్పణ
Supreme Court
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 17, 2021 | 9:29 AM

తమ డిమాండ్ల సమస్యపై తలెత్తిన సంక్షోభ పరిష్కారానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని మిగతా ముగ్గురు సభ్యులను తొలగించాలని భారతీయ కిసాన్ యూనియన్ లోక్ శక్తి కోరింది. ఈ మేరకు కోర్టుకు  ఓ అఫిడవిట్ ను సమర్పించింది. పరస్పర సామరస్య ప్రాతిపదికపై తమతో చర్చించే వారితో కూడిన కమిటీని నియమించాలని ఈ సంఘం అభ్యర్థించింది. సుప్రీంకోర్టు మొదట ఏర్పాటు చేసిన పానెల్ లోని నలుగురు సభ్యుల్లో ఒకరైన భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ భూపేందర్ సింగ్ మాన్ ఇందులో నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కమిటీలో ఉన్న ముగ్గురు సభ్యులూ రైతు చట్టాలకు అనుకూలురేనని, వారితో తాము చర్చించే ప్రసక్తే లేదని రైతు సంఘాలు ఇదివరకే స్పష్టం చేశాయి. ఈ నెల 26 న జరిగే ట్రాక్టర్ ర్యాలీని, రైతుల నిరసనను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ పోలీసుల తరఫున కేంద్రం ఓ ఇంజంక్షన్ ను దాఖలు చేసిన నేపథ్యంలో దీన్ని కొట్టివేయాలని కూడా సుప్రీంకోర్టును ఈరైతు సంఘం అభ్యర్థించింది. ఈ ఇంజంక్షన్ పైన, ఈ అఫిడవిట్ పైన కోర్టు సోమవారం విచారణ జరపనుంది. తాము నియమించిన కమిటీ నుంచి మాన్ నిష్క్రమించడంపై కూడా అత్యున్నత న్యాయస్థానం దృష్టి సారించనుంది.

ఇక కేంద్రంతో తాడోపేడో తేల్చుకొవాలనే నిశ్చయంతో ఉన్న రైతు సంఘాలు ఈ నెల 26 న ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించాలనే దాదాపు నిర్ణయించాయి. సిఖ్ ఫర్ జస్టిస్ అనే సంస్థ కూడా ఈ సంఘాలతో చేతులు కలిపింది. దీంతో ఈ రైతుల నిరసనలో ఖలిస్తానీల జోక్యం ఉందా అని జాతీయ దర్యాప్తు సంస్థ భావిస్తోంది. సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థను ఇదివరకే నిషేధించారు.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??