Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio phone Next: జియో ఫోన్ నెక్స్ట్ ఆలస్యం ఎందుకు? తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కష్టమేనా? మార్కెట్ లోకి వచ్చేది అప్పుడేనా?

రిలయన్స్ జియో నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ విడుదల ఆలస్యం అవుతోంది. సెమీకండక్టర్ల సరఫరా నిర్వహణలో కంపెనీ నిమగ్నమై ఉంది. మరోవైపు, ఫోన్‌లో ఉపయోగించే సెమీకండక్టర్ మార్కెట్‌లో కొరవడిందని నిపుణులు చెబుతున్నారు.

Jio phone Next: జియో ఫోన్ నెక్స్ట్ ఆలస్యం ఎందుకు? తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కష్టమేనా? మార్కెట్ లోకి వచ్చేది అప్పుడేనా?
Jio Phone Next
Follow us
KVD Varma

|

Updated on: Sep 13, 2021 | 9:17 AM

Jio phone Next: రిలయన్స్ జియో నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ విడుదల ఆలస్యం అవుతోంది. సెమీకండక్టర్ల సరఫరా నిర్వహణలో కంపెనీ నిమగ్నమై ఉంది. మరోవైపు, ఫోన్‌లో ఉపయోగించే సెమీకండక్టర్ మార్కెట్‌లో కొరవడిందని నిపుణులు చెబుతున్నారు. వాటి ధర కూడా పెరుగుతోంది. దీని కారణంగా ఫోన్‌ను తక్కువ ధరకు విక్రయించడం సవాలుగా మారింది. ఫోన్‌ను ఆలస్యంగా లాంచ్ చేయడం వల్ల, దాన్ని బాగా పరీక్షించగలమని జియో కంపెనీ చెబుతోంది. అలాగే, ఫోన్ ఫీచర్.. సాంకేతిక లోపాలను అధిగమించవచ్చని కంపెనీ భావిస్తోంది. ధర పరంగా సెమీకండక్టర్ కొరత ప్రభావంతో మొదట్లో ఫోన్ తక్కువ ధర తక్కువగా ఉన్నా.. తరువాత దీనిని పెంచే అవకాశం ఉంది.

వాస్తవానికి.. ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన సెమీకండక్టర్ ధర 20%పెరిగింది. అదే సమయంలో, సెమీకండక్టర్ల లభ్యత లోటు 8 నుండి 20 వారాల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. Jio ప్రస్తుతం సెమీ కండక్టర్ల సరఫరా నిర్వహణలో నిమగ్నమై ఉంది. ఒకవేళ ఫోన్ లాంచ్ చేసినప్పటికీ, ఇది వచ్చే ఏడాది వరకు పరిమిత స్టాక్‌లోనే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఫోన్ లాంచ్ దీపావళి నాటికే..?

సెమీకండక్టర్స్ లేకపోవడం వల్ల, ఫోన్ ఇప్పుడు దీపావళికి ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ 10 న దీనిని ప్రారంభించాలని జియో ఇంతకు ముందే చెప్పింది కానీ ఆతేదీన ఫోన్ లాంచ్ చేయలేకపోయారు. ఫోన్ విడుదల వాయిదా వేస్తున్నట్టు కంపెనీ చెప్పింది. ఎప్పుడు లాంచ్ చేసేదీ కచ్చితంగా చెప్పలేదు. ఫోన్ మార్కెట్ లోకి తీసుకురావడంలో ఆలస్యం మధ్య అందుబాటులో ఉన్న సమయం సెమీకండక్టర్ల కొరతను అధిగమించడానికి సహాయపడుతుంది.

చిప్ కొరత పండుగ సీజన్‌ని ప్రభావితం చేయదు

IDC నివేదిక ప్రకారం, ల్యాప్‌టాప్‌లు.. టీవీల వంటి స్మార్ట్‌ఫోన్‌లు పండుగ సీజన్ కు సిద్ధం అవుతున్నాయి. భారత మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద మార్కెట్. దీని కోసం అన్ని బ్రాండ్లు సన్నద్ధమయ్యాయి. మార్కెట్ కోసం మరింత నిల్వ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తద్వారా పండుగ సీజన్‌లో ఉత్పత్తికి కొరత ఉండదు.

ఫోన్ విడుదల వాయిదా 

టెలికాం రంగంలో సంచనాలకు పేరున్న రిలయన్స్‌ జియో  చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది మొదలు అందరిలో ఆసక్తి పెరిగింది.  జూన్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 44వ ఏజీఎంలో ముకేశ్ అంబానీ అతి చౌకైన స్మార్ట్ ఫోన్ అందిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గణేష్‌ చతుర్థి రోజున సెప్టెంబర్ 10న ఈ ఫోన్ విడుదల కాబోతోందని ప్రకటించారు. కానీ, దీనిని వాయిదా వేసింది రిలయన్స్‌ జియో. దీపావళి పండగ సీజన్‌ నాటికి ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ వెల్లడించింది.

రిలయన్స్‌ – గూగుల్‌ భాగస్వామ్యంతో అత్యంత చౌకైన ‘జియో ఫోన్‌ నెక్స్ట్‌’ను అభివృద్ధి చేసినట్లు రిలయన్స్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌ను సెప్టెంబరు 10న విడుదల చేయనున్నట్లు అప్పట్లో ఆయన వెల్లడించారు. అయితే, వినియోగదారుల మెప్పు పొందేలా ఈ ఫోన్‌ను మెరుగ్గా అభివృద్ధి చేసేందుకు మరింత సమయం తీసుకుంటున్నట్లు ఫోన్ విడుదల వాయిదా వేసిన సందర్భంగా కంపెనీ పేర్కొంది.  ఫోన్‌లో మరిన్ని ఫీచర్లు తీసుకొచ్చేందుకు కొంతమంది పరిమిత యూజర్లతో జియోఫోన్‌ నెక్స్ట్‌ టెస్టింగ్‌ను రిలయన్స్‌ జియో, గూగుల్‌ ప్రారంభించాయి. ”దీపావళి పండగ సీజన్‌ నాటికి ఈ ఫోన్‌ను మార్కెట్లో విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అప్పటికి పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న సెమీకండక్టర్ల కొరత కూడా తీరుతుందని భావిస్తున్నాం’’ అని రెండు కంపెనీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

Also Read: Jio phone next: చౌకైన 4జీ జియో ఫోన్ నెక్స్ట్ బంపరాఫర్.. కొద్దిగా చెల్లిస్తే …మిగతాది వాయిదాలలో చెల్లించవచ్చు