జో బైడెన్ బృందంలో మరో ఇద్దరు భారతీయులు.. వినయ్‌రెడ్డి, గౌతమ్ రాఘవన్‌లకు వైట్‌హౌస్‌లో చోటు..
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ బృందంలో మరో ఇద్దరు భారత సంతతికి చెందిన అమెరికన్లకు చోటు దక్కింది. జో బైడెన్ తన ప్రసంగ రచయితగా వినయ్‌రెడ్డి, సిబ్బంది కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్‌గా గౌతమ్ రాఘవన్‌ను నియమించారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ బృందంలో మరో ఇద్దరు భారత సంతతికి చెందిన అమెరికన్లకు చోటు దక్కింది. జో బైడెన్ తన ప్రసంగ రచయితగా వినయ్‌రెడ్డిని నియమించుకున్నారు. బైడెన్‌కు వినయ్ రెడ్డి దీర్ఘకాలం సహాయకుడిగా పనిచేశారు. అలాగే, మరో భారతీయుడికి వైట్‌హౌస్ బైడెన్ టీంలో స్థానం దక్కింది. అధ్యక్ష సిబ్బంది కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్‌గా గౌతమ్ రాఘవన్‌ను నియమించారు. రాఘవన్ గతంలోనూ వైట్‌హౌ్‌సలో సేవలందించారు. వీరితో పాటు నిర్వహణ, పరిపాలన డైరెక్టర్‌గా అన్నె ఫిలిపిక్, బైడెన్ కార్యక్రమాలను ఖరారుచేసే బాధ్యతను డైరెక్టర్‌గా ర్యాన్ మోంటోయా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బ్రూస్ రీడ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్‌కు సీనియర్ సలహాదారుగా ఎలిజబెత్ విల్కిన్స్‌లను బైడెన్, కమలా హారిస్ నియమించారు. కాగా, ఇటీవల జరగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ త్వరలో అధ్యక్ష బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఈ నేపధ్యంలో తనకు సంబంధించి పాలనాపరమైన బృందాన్ని నియమించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా గెలుపొందారు.