జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బుధవారం బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం బీజేపీ అగ్ర నేతలతో సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నడ్డాతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. అలాగే, త్వరలో జరుగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.