మాటల యుద్ధం కాదు.. ప్రజా సమస్యలే ముఖ్యం – జనసేన ఎమ్మెల్యే

అధికార, ప్రతిపక్షాల నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం కన్నా.. ప్రజా సమస్యలపై  ప్రధానంగా చర్చ జరిగితే బాగుంటుందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇవాళ శాసనసభలో సభ సంప్రదాయాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధంపై ఆయన స్పందిస్తూ.. అందరూ కూడా సంప్రదాయాల గురించే మాట్లాడుతున్నారని.. ఇది మంచి పరిణామం కాదని అన్నారు. సమావేశాలను ఎంతో మంది రాజకీయ మేధావులు చూస్తున్నారని.. మాటల యుద్ధం కంటే ప్రజాసమస్యలపై […]

మాటల యుద్ధం కాదు.. ప్రజా సమస్యలే ముఖ్యం - జనసేన ఎమ్మెల్యే

Edited By:

Updated on: Jun 14, 2019 | 12:16 PM

అధికార, ప్రతిపక్షాల నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం కన్నా.. ప్రజా సమస్యలపై  ప్రధానంగా చర్చ జరిగితే బాగుంటుందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇవాళ శాసనసభలో సభ సంప్రదాయాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధంపై ఆయన స్పందిస్తూ.. అందరూ కూడా సంప్రదాయాల గురించే మాట్లాడుతున్నారని.. ఇది మంచి పరిణామం కాదని అన్నారు. సమావేశాలను ఎంతో మంది రాజకీయ మేధావులు చూస్తున్నారని.. మాటల యుద్ధం కంటే ప్రజాసమస్యలపై చర్చ జరిగితే బాగుంటుందని ఆయన కోరారు. అధికార పార్టీకి సంఖ్యా బలం ఎక్కువ ఉన్నా.. సభలో ఉన్న సభ్యులందరికి మాట్లాడే అవకాశం కల్పిస్తామని అధికార పార్టీ చెప్పడం మంచి పరిణామం అని ఆయన అన్నారు. పరస్పర విమర్శల కంటే ప్రజా సమస్యల పరిష్కారంపై కృషి చేస్తే మంచిదని సభ్యులందరికి రాపాక వరప్రసాదరావు తెలియజేశారు.