AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌కు ప్రత్యేక స్పేస్ స్టేషన్: ఇస్రో చీఫ్

అంతరిక్షంలో భారత దేశానికి ప్రత్యేక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ శివన్ తెలిపారు. గగన్‌‌యాన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇది చాలా చిన్న కేంద్రమని, మైక్రోగ్రావిటీ ప్రయోగాల నిర్వహణకు దీనిని ఉపయోగించవచ్చునని ఆయన వివరించారు. ఈ స్పేస్ స్టేషన్ ప్రణాళికను రాబోయే 10 ఏళ్ళలో రూపొందిస్తామన్నారు. దీనికయ్యే ఖర్చును ఇంకా అంచనా వేయలేదన్నారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా జూలైలో […]

భారత్‌కు ప్రత్యేక స్పేస్ స్టేషన్: ఇస్రో చీఫ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 13, 2019 | 4:57 PM

Share

అంతరిక్షంలో భారత దేశానికి ప్రత్యేక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ శివన్ తెలిపారు. గగన్‌‌యాన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇది చాలా చిన్న కేంద్రమని, మైక్రోగ్రావిటీ ప్రయోగాల నిర్వహణకు దీనిని ఉపయోగించవచ్చునని ఆయన వివరించారు. ఈ స్పేస్ స్టేషన్ ప్రణాళికను రాబోయే 10 ఏళ్ళలో రూపొందిస్తామన్నారు. దీనికయ్యే ఖర్చును ఇంకా అంచనా వేయలేదన్నారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా జూలైలో ప్రయోగించే చంద్రయాన్ -2పైనా, 2022లో ప్రయోగించే గగన్‌యాన్‌పైనా ఉందని తెలిపారు. గగన్‌యాన్ భారత దేశ తొలి మానవ సహిత కార్యక్రమమని తెలిపారు. గగన్‌యాన్‌ ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్తుందన్నారు. రాబోయే 6 నెలల్లో ఈ వ్యోమగాముల ఎంపిక పూర్తవుతుందని తెలిపారు. ఎంపికైనవారికి దాదాపు రెండేళ్ళపాటు కఠోర శిక్షణ ఇస్తామని శివన్ స్పష్టం చేశారు.

Follow Us
నేటి నుంచి కొత్త రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..
నేటి నుంచి కొత్త రూల్స్.. కొత్తగా అమల్లోకి వచ్చేవి ఇవే..
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు