ఉద్రిక్తంగా పవన్ కాకినాడ పర్యటన!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన టెన్షన్ టెన్షన్‌గా మారింది. తాజాగా విశాఖ నుంచి కాకినాడకు చేరుకున్న పవన్.. జనసేన పార్టీ నాయకుడు నానాజీతో ఆయన ఇంటిలో సమావేశమయ్యారు. కాగా.. పవన్ కల్యాణ్ వెంట భారీగా కార్యకర్తలు ఉండటంతో తుని, ప్రత్తిపాడు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రధాన రహదారులను మూసివేశారు పోలీసులు. తునిలో పది వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు రహదారులను మూసి వెయడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక అటు నానాజీ ఇంటి […]

ఉద్రిక్తంగా పవన్ కాకినాడ పర్యటన!

Edited By:

Updated on: Jan 14, 2020 | 5:12 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన టెన్షన్ టెన్షన్‌గా మారింది. తాజాగా విశాఖ నుంచి కాకినాడకు చేరుకున్న పవన్.. జనసేన పార్టీ నాయకుడు నానాజీతో ఆయన ఇంటిలో సమావేశమయ్యారు. కాగా.. పవన్ కల్యాణ్ వెంట భారీగా కార్యకర్తలు ఉండటంతో తుని, ప్రత్తిపాడు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రధాన రహదారులను మూసివేశారు పోలీసులు. తునిలో పది వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు రహదారులను మూసి వెయడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక అటు నానాజీ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు.

కాగా కాకినాడలో ప్రస్తుతం 144 సెక్షన్ అమలవుతోంది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. పవన్‌పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్.. షాకింగ్ కామెంట్స్ చేయడంతో.. ఆదివారం ఆయన ఇంటిని, జనసేన కార్యకర్తలు ముట్టడించారు. ఈ నేపథ్యంలో కాకినాడలో పవన్ పర్యటన ఉద్రిక్త వాతావరణాన్ని నింపింది.