జమ్మూ లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై ఇటీవల జరిగిన డ్రోన్ల దాడికేసులో ఎన్ఐఏ తన ఇన్వెస్టిగేషన్ ని మరింత పెంచింది. ఈ డ్రోన్లలో కూర్చిన పేలుడు పదార్థాలు (బాంబులు) పాకిస్తాన్ లోని ఆయుధాగారంలో తయారైనవేనని ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఫోరెన్సిక్ విభాగం తెలిపింది. డ్రోన్లకు ఎటాచ్ చేసిన ఐఈడీలు అత్యంత అధునాతనమైనవని ఇవి పాక్ ఆయుధాగారంలో తయారైవని పేర్కొంది. వీటిలో ఆర్ డీ ఎక్స్ తో బాటు నైట్రేట్ మిశ్రమాన్ని కూడా వాడారు. సుమారు ఒకటిన్నర కేజీల నుంచి రెండు కేజీల పేలుడు పదార్థాలను ఈ డ్రోన్లల్లో కూర్చారని ఈ విభాగం తమ నివేదికలో వెల్లడించింది. వీటిలో ఆర్ డీ ఎక్స్ చాలా పవర్ ఫుల్ అని సైనిక వర్గాలు తెలిపాయి. ఓక డ్రోన్ లోని బాంబును ఈ వైమానిక స్థావరంలోని మెషిన్లకు, మరొకదాన్ని స్టాఫ్ కు టార్గెట్ చేసినట్టు ఈ వర్గాలు వివరించాయి. జూన్ 27 తరువాత కూడా వరుసగా వారంలో నాలుగైదు సార్లు జమ్మూ ఎయిర్ బేస్ మీదుగా డ్రోన్లు ఎగిరాయి.
ఈ నేపథ్యంలో తమ ఎయిర్ బేస్ ను డ్రోన్ల బారి నుంచి రక్షించుకునేందుకు పది కౌంటర్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టం లను సమకూర్చుకోవాలని భారత వైమానిక దళం భావిస్తోంది. ఇవి డ్రోన్లను పసి గట్టి వాటిని నిర్వీర్యం చేయగలవు. అయితే ఈ సిస్టం లు మన భారతీయ కంపెనీల్లో తయారైనవే ఉండాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోరుతోంది. తద్వారా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నది ఈ సంస్థ లక్ష్యంగా చెబుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : మాస్క్ లేదంటే బాదుతున్న బుడ్డోడు..! పట్టించుకోని పర్యాటకులు..వైరల్ అవుతున్న చిన్నారి వీడియో :Little Boy In Dharamshala Video.