జ‌మ్మూ, శ్రీ‌న‌గ‌ర్‌ల‌లో త్వ‌ర‌లో కూత‌పెట్ట‌నున్న మెట్రో రైలు.. 48 కిలోమీటర్లు.. 34 స్టేష‌న్లు

|

Dec 15, 2020 | 8:02 AM

జ‌మ్మూ శ్రీ‌న‌గ‌ర్ న‌గ‌రాల్లో త్వ‌ర‌లో మెట్రో రైలు కూత‌పెట్ట‌నుంది. జ‌మ్మూన‌గ‌రంలో 23 కిలోమీట‌ర్ల దూరం 22 రైల్వే స్టేష‌న్ల‌తో బంట‌లాబ్ నుంచి భారీ బ్రాహ‌మ‌న వ‌ర‌కు లైట్ రైల్ సిస్ట‌మ్ నిర్మించాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వం....

జ‌మ్మూ, శ్రీ‌న‌గ‌ర్‌ల‌లో త్వ‌ర‌లో కూత‌పెట్ట‌నున్న మెట్రో రైలు.. 48 కిలోమీటర్లు.. 34 స్టేష‌న్లు
Follow us on

జ‌మ్మూ శ్రీ‌న‌గ‌ర్ న‌గ‌రాల్లో త్వ‌ర‌లో మెట్రో రైలు కూత‌పెట్ట‌నుంది. జ‌మ్మూన‌గ‌రంలో 23 కిలోమీట‌ర్ల దూరం 22 రైల్వే స్టేష‌న్ల‌తో బంట‌లాబ్ నుంచి భారీ బ్రాహ‌మ‌న వ‌ర‌కు లైట్ రైల్ సిస్ట‌మ్ నిర్మించాల‌ని అక్క‌డి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జ‌మ్మూక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా అధ్య‌క్ష‌త‌న సివిల్ స‌చివాల‌యంలో జ‌రిగిన ఉన్న‌తాధికారుల స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. శ్రీ‌న‌గ‌ర్‌లో 25 కిలోమీట‌ర్ల దూరం మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాల‌ని లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ సూచించారు.

శ్రీ‌న‌గ‌ర్‌లో ఇందిరాన‌గ‌ర్ నుంచి హెచ్ ఎంటీ జంక్ష‌న్ వ‌ర‌కు 12.5 కిలోమీట‌ర్లు, హ‌జారీబాగ్ నుంచి ఉస్మానాబాద్ వ‌ర‌కు 12.5 కిలోమీట‌ర్ల దూరం మెట్రో రైలు నిర్మాణం చేప‌ట్టాల‌ని ప్ర‌తిపాదించారు. దీనిలో 12 స్టేష‌న్లు నిర్మించ‌నున్నారు. రెండు ప్ర‌ధాన న‌గ‌రాల్లోనూ వేగంగా మెట్రో ప్రాజెక్టు చేప‌ట్టి రెండేళ్ల‌లోగా పూర్తి చేయాల‌ని లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్ అధికారుల‌కు సూచించారు. ఈ మెట్రో రైలు ఏర్పాటు కావ‌డం ప‌ట్ల ప్ర‌యాణికుల‌కు ఎంతో సౌక‌ర్యంగా ఉండ‌టంతో పాటు ఆర్థిక అభివృద్ధికి ఎంతో మేలు జ‌రుతుంద‌ని గ‌వ‌ర్న‌ర్ అన్నారు.