దాడి గురించి ఉగ్ర సంస్థ ముందే హెచ్చరించిందా..?

| Edited By: Srinu

Mar 07, 2019 | 8:25 PM

శ్రీనగర్/ జమ్ము: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 44మంది జవాన్లు మరణించగా.. మరికొందరు గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ దాడి గురించి జైషే మహ్మద్ రెండు రోజుల క్రితమే హెచ్చరించినట్లు అధికారులు అంటున్నారు. ఆప్ఘనిస్థాన్‌లో జరిగిన ఓ దాడికి సంబంధించిన వీడియోను రెండు రోజుల క్రితం జైషే మహ్మద్ వర్గాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాయి. ఈ వీడియోను గమనించిన జమ్ముకశ్మీర్ రాష్ట్ర పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు.. వీడియోతో పాటు అవసరమైన ఇన్‌పుట్స్‌ను […]

దాడి గురించి ఉగ్ర సంస్థ ముందే హెచ్చరించిందా..?
Follow us on

శ్రీనగర్/ జమ్ము: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 44మంది జవాన్లు మరణించగా.. మరికొందరు గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ దాడి గురించి జైషే మహ్మద్ రెండు రోజుల క్రితమే హెచ్చరించినట్లు అధికారులు అంటున్నారు. ఆప్ఘనిస్థాన్‌లో జరిగిన ఓ దాడికి సంబంధించిన వీడియోను రెండు రోజుల క్రితం జైషే మహ్మద్ వర్గాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాయి. ఈ వీడియోను గమనించిన జమ్ముకశ్మీర్ రాష్ట్ర పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు.. వీడియోతో పాటు అవసరమైన ఇన్‌పుట్స్‌ను ఇంటిలిజెన్స్ వర్గాలకు షేర్ చేశాయి.

అయితే ఈ హెచ్చరికలను ఇంటిలిజెన్స్ అధికారులు పట్టించుకోలేదని.. ఫలితంగా 44మంది జవాన్లు మరణించారని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు దాడి పట్ల ఆర్మీ ఉన్నతాధికారులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారీ సంఖ్యలో బలగాలు శ్రీనగర్‌కు వెళుతున్న విషయం ముందే ఉగ్రవాదులకు లీకై ఉండవచ్చని భావిస్తున్నారు.