Chandra Kumar Bose : సభలో జైహింద్, జై శ్రీరామ్ అనడం తప్పేమికాదు : నేతాజీ మనవడు చంద్ర కుమార్ బోస్

| Edited By: Pardhasaradhi Peri

Jan 24, 2021 | 10:31 AM

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం కోల్ కతాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరాకరించారు. ఈ ప్రోగ్రాం లో తనను అవమానించారని ఆమె..

Chandra Kumar Bose : సభలో జైహింద్, జై శ్రీరామ్ అనడం తప్పేమికాదు : నేతాజీ మనవడు చంద్ర కుమార్ బోస్
Follow us on

Chandra Kumar Bose : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం కోల్ కతాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరాకరించారు. ఈ ప్రోగ్రాం లో తనను అవమానించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా విక్టోరియా మెమోరియల్‌లో జరిగిన ఈ సభలో కొందరు భజరంగ్ దళ్ కార్యకర్తలు జై శ్రీరాం అన్నందుకు మమతాబెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ విషయం పై నేతాజీ మనవడు, బీజేపీ నేత చంద్ర కుమార్ బోస్ స్పందించారు.

ఆయన మాట్లాడుతూ.. సభలో జైహింద్, జై శ్రీరామ్ అన్నందుకు అంతగా ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు.. ఇండియన్ ఆర్మీ కు, అమరవీరులకు నివాళులర్పించాల్సిన సమయం అని చంద్ర కుమార్ బోస్ అన్నారు. అన్ని సామాజిక వర్గాల వారు ఆజాద్ హిందూ ఫౌజ్‌లో సభ్యులుగా ఉన్నారని అయన అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐక్యత కోసం నిలబడ్డారని చంద్ర కుమార్ బోస్ గుర్తుచేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ప్రధాని మోదీ సమక్షంలో ‘జై శ్రీరామ్’,’ మోడీ మోడీ’ నినాదాలు, నేతాజీ ఈవెంట్ లో దీదీ ఆగ్రహం, అసహనం