ప్రధాని మోదీ సమక్షంలో ‘జై శ్రీరామ్’,’ మోడీ మోడీ’ నినాదాలు, నేతాజీ ఈవెంట్ లో దీదీ ఆగ్రహం, అసహనం

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం కోల్ కతాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరాకరించారు.

ప్రధాని మోదీ సమక్షంలో 'జై శ్రీరామ్',' మోడీ మోడీ' నినాదాలు, నేతాజీ ఈవెంట్ లో దీదీ ఆగ్రహం, అసహనం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 23, 2021 | 7:57 PM

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం కోల్ కతాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరాకరించారు. ఈ ప్రోగ్రాం లో తనను అవమానించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతోబాటు వేదికపైన కూర్చున్న మమత ప్రసంగించేందుకు రాగా-ఈ కార్యక్రమానికి హాజరైన ఓ వర్గం’ జై శ్రీరామ్’. ‘మోడీ. మోడీ’ అంటూ నినాదాలు చేసి ఆమె స్పీచ్ కి ఆటంకం కలిగించారు. దీంతో అసహనానికి గురైన  ఆమె.. ఈ విధమైన ఈవెంట్లు ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబందించినవి కావని, ప్రభుత్వ కార్యక్రమాలను గౌరవించాలని అన్నారు. ఇది అన్ని పార్టీలకు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రాం అని వ్యాఖ్యానించారు. ఏమైనా…. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు ప్రధానికి, కేంద్ర సాంస్కృతిక శాఖకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అంటూ.. ‘జైహింద్’, ‘జై బంగ్లా’ అని ముగించారు. అటు- నేతాజీ జయంతి కార్యక్రమం జరుగుతున్నంత సేపూ ఆమె ముభావంగా ఉన్నారు. .

బెంగాల్ లో మరో మూడు, నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ రాష్ట్రంలో రోజురోజుకీ బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య వైషమ్యాలు, విభేదాలు పెరుగుతున్నాయి.  ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య పరస్పర దాడులు దాదాపు నిత్యకృత్యమయ్యాయి. బెంగాల్ లో ఎలాగైనా   అధికార పగ్గాలను చేబట్టేందుకు బీజేపీ తహతహలాడుతోంది.

Read More:మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారుతున్న నటుడు.. ట్యూన్స్ రెడీ చేస్తున్నాడా..!