జై శ్రీరాం నినాదం పై.. ఆమర్త్యసేన్ ఏమన్నారంటే..?
జై శ్రీరాం నినాదంపై నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ సాహితీ వేత్త ఆమర్త్యసేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాదవపూర్ విశ్వవిద్యాలయంలో జరిగిన బహిరంగ సభలో అమర్త్యసేన్ మాట్లాడుతూ.. గతంలో తానెప్పుడూ జై శ్రీరాం నినాదం వినలేదని చెప్పారు. జై శ్రీరాం నినాదం బెంగాల్ సంప్రదాయంలో లేదని, ఈ నివాదం కేవలం ప్రజలను కొట్టడానికి ఉపయోగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అసలు బెంగాల్ రాష్ట్రంలో శ్రీరామనవమి వేడులకు నిర్వహించడం వినలేదని, ఇప్పుడు రామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఓ మతం […]
జై శ్రీరాం నినాదంపై నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ సాహితీ వేత్త ఆమర్త్యసేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాదవపూర్ విశ్వవిద్యాలయంలో జరిగిన బహిరంగ సభలో అమర్త్యసేన్ మాట్లాడుతూ.. గతంలో తానెప్పుడూ జై శ్రీరాం నినాదం వినలేదని చెప్పారు. జై శ్రీరాం నినాదం బెంగాల్ సంప్రదాయంలో లేదని, ఈ నివాదం కేవలం ప్రజలను కొట్టడానికి ఉపయోగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అసలు బెంగాల్ రాష్ట్రంలో శ్రీరామనవమి వేడులకు నిర్వహించడం వినలేదని, ఇప్పుడు రామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఓ మతం ప్రజలు స్వేచ్ఛగా జీవించకుండా, వారిని భయపట్టేందుకు ఈ నినాదాన్ని వాడుకోవడం తీవ్రమైన చర్య అని ఆయన అన్నారు. పాత ఢిల్లీలోని దుర్గా దేవాలయం వద్ద వాహనాల పార్కింగ్ వివాదం వల్ల జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆమర్త్యసేన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, జై శ్రీరాం నినాదం పై గతంలోనే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.