‘అమ్మఒడి’ వర్తించని వారికి గుడ్ న్యూస్.. ఆ లబ్దిదారులకు మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!

|

Dec 23, 2020 | 4:25 PM

Jagananna Ammavodi Scheme: అమ్మఒడి వర్తించని వారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. అర్హత ఉండి కూడా అవకాశాన్ని కల్పించింది.

అమ్మఒడి వర్తించని వారికి గుడ్ న్యూస్.. ఆ లబ్దిదారులకు మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!
Follow us on

Jagananna Ammavodi Scheme: అమ్మఒడి వర్తించని వారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేనివారికి మరో అవకాశాన్ని కల్పించింది. ఈ నెల 26లోపు అమ్మఒడి లబ్దిదారుల జాబితాను సంబంధిత సచివాలయాల్లో ప్రదర్శిస్తామని.. అందులో పేర్లు నమోదు కానివారు తమ సమీప గ్రామ/వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తులో ఉన్న సమస్యను పరిష్కరించుకోవాలని.. ఇందుకోసం ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

డిసెంబర్ 30న అమ్మఒడి లబ్దిదారుల తుది జాబితాను ప్రకటిస్తామని చెప్పిన మంత్రి.. జనవరి 9న ఏపీ సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా అమ్మఒడి పధకం డబ్బులు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పుకొచ్చారు. గతంలో ఇన్‌కమ్ టాక్స్ చెల్లించని వారు ఈ పధకానికి అనర్హులని తెలిపారు. కాగా, ప్రైవేట్ స్కూల్ విద్యార్ధులకు కూడా సీఎం జగన్ అమ్మఒడిని వర్తింపజేశారని.. పధకం నగదును ఫీజులతో ముడిపెడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు.

Also Read:

‘స్ట్రెయిన్’ వైరస్ వ్యాప్తిపై కేంద్రం క్లారిటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టత..!

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. జనవరి 1 నుంచి చలానాల బాదుడు షురూ.. లైట్ తీసుకుంటే ఇక అంతే.!

ఆన్‌లైన్‌ కాల్‌మనీపై సీఎం జగన్ సీరియస్.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

‘సీబీఎస్‌సీ’ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వాయిదా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..!