జగన్ చదువుకున్న స్కూల్ ఇదే..!

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా అనేక కీలక పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు జగన్ ఏపీ సీఎం కావడంతో హెచ్‌పీఎస్ మరో ఘనతను సొంతం చేసుకుంది. తమతో పాటు చదువుకున్న జగన్ సీఎం కావడంతో తోటి మిత్రులు ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తన చిన్ననాటి స్నేహితుడు జగన్.. ఏపీ సీఎం కావడం పట్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌పీఎస్‌లో 1979లో […]

జగన్ చదువుకున్న స్కూల్ ఇదే..!

Edited By:

Updated on: May 30, 2019 | 9:49 AM

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా అనేక కీలక పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు జగన్ ఏపీ సీఎం కావడంతో హెచ్‌పీఎస్ మరో ఘనతను సొంతం చేసుకుంది. తమతో పాటు చదువుకున్న జగన్ సీఎం కావడంతో తోటి మిత్రులు ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

తన చిన్ననాటి స్నేహితుడు జగన్.. ఏపీ సీఎం కావడం పట్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌పీఎస్‌లో 1979లో ఒకటో తరగతిలో చేరి ప్లస్‌ 2వరకు అక్కడే పూర్తి చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సినీ నటుడు సుమంత్, సియానత్ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ అమీర్ అలీఖాన్, కోటంరెడ్డి వినయ్ రెడ్డి ఆయన క్లాస్‌మేట్స్. జగన్ అన్నింటిలో ముందుండే వారని వారంతా గర్వంగా చెప్తున్నారు. త్వరలో వైఎస్ జగన్‌తో కలిసి ఓల్డ్ స్టూడెంట్ మీట్ ఏర్పాటు చేస్తామంటున్నారు.