హైదరాబాద్‌లో జగన్… రెండ్రోజుల ఎజెండా ఇదే

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్‌లో మకాం వేశారు. రెండ్రోజుల పాటు హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసంలో ఆయన రెండ్రోజులు వుండబోతున్నారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న జగన్… సోమవారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగే భేటీ తర్వాతనే తిరిగి అమరావతికి పయనం అవుతారని సీఎం కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ రెండ్రోజులు ఆయన ఏం చేయబోతున్నారు? ఇదిప్పుడు రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. ఏపీ రాజధాని అంశం అత్యంత కీలకంగా మారిన […]

హైదరాబాద్‌లో జగన్... రెండ్రోజుల ఎజెండా ఇదే
Follow us
Rajesh Sharma

|

Updated on: Jan 11, 2020 | 2:36 PM

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్‌లో మకాం వేశారు. రెండ్రోజుల పాటు హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసంలో ఆయన రెండ్రోజులు వుండబోతున్నారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న జగన్… సోమవారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగే భేటీ తర్వాతనే తిరిగి అమరావతికి పయనం అవుతారని సీఎం కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ రెండ్రోజులు ఆయన ఏం చేయబోతున్నారు? ఇదిప్పుడు రాజకీయవర్గాల్లో చర్చగా మారింది.

ఏపీ రాజధాని అంశం అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో అందుబాటులో వున్న నివేదికలను స్వయంగా అధ్యయనం చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దాని కోసం ఆయన లోటస్ పాండ్ నివాసంలో ఏర్పాట్లు చేసుకున్నారని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణ సీఎంతో జరిగే భేటీలో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై ప్రధానంగా చర్చ జరగనుంది. అయితే.. దీనికి సంబంధించి సాగునీటి రంగ నిఫుణులతో కీలకమైన బ్రీఫింగ్ ఏర్పాట్లు జగన్ హైదరాబాద్‌లో చేసుకున్నారని తెలుస్తోంది.

రెండు రోజుల మకాంలో రెండు కీలకాంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపేందుకు ఏపీ సీఎం ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం 11 గంటలకు తెలుగు ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతోంది. అది లంచ్‌తో ముగిస్తే.. ఆ వెంటనే జగన్ అమరావతికి పయనమవుతారని తెలుస్తోంది.