Jagan Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెరిగిన పింఛన్ల సంఖ్య.!

|

Mar 01, 2020 | 2:30 PM

జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో ఒకటి పింఛన్ పథకం. ఇవాళ్టి నుంచి ఈ సంఖ్యను మరింతగా పెరగబోతోంది. ఈ రోజు నుంచి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛనుదారుల సంఖ్యను 58,99,065 పెంచింది. గత నెలతో పోలిస్తే 4,30,743 పింఛన్లు పెరిగాయి.

Jagan Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెరిగిన పింఛన్ల సంఖ్య.!
Follow us on

Jagan Government: జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో ఒకటి పింఛన్ పథకం. ఇవాళ్టి నుంచి ఈ సంఖ్యను మరింతగా పెరగబోతోంది. ఈ రోజు నుంచి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛనుదారుల సంఖ్యను 58,99,065 పెంచింది. గత నెలతో పోలిస్తే 4,30,743 పింఛన్లు పెరిగాయి. జగన్ సర్కార్ ఫిబ్రవరిలో 54,68,322 మందికి పింఛన్లు పంపిణీ చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం నెలన్నర వ్యవధిలో కొత్తగా 7.41 లక్షల(ఫిబ్రవరిలో 6.14 లక్షలు, మార్చిలో 1.27 లక్షలు) మందికి పింఛన్లు మంజూరు చేసింది.

కాగా, ఇవాళ ఆదివారం అయినప్పటికీ గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్ధిదారులకు ఇంటి వద్దనే డబ్బును అందజేస్తారని తెలిసిన విషయమే. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభించింది. ఇక ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకల్లా 45.24 లక్షల పింఛన్లు పంపిణీ చేశారు. అటు అర్హులై గత వారం అందనివారికి, వెరిఫికేషన్‌ పూరై్తన వారికి ఒకేసారి రూ.4,500 పెన్షన్ల అందజేశారు. పింఛన్లు పొందే లబ్ధిదారుల సంఖ్య ఏ జిల్లాకు ఎంత పెరిగిందంటే.. ఎక్కువశాతం తూర్పుగోదావరిలో 6,23,093 మంది, తక్కువగా విజయనగరంలో 3,02,734 మంది కొత్తగా పింఛన్లు పొందనున్నారు.

For More News:

యువతిని నమ్మించి రిలేషన్ పెట్టుకున్నా అత్యాచారమే.. హైకోర్టు సంచలన తీర్పు!

భారత్ బౌలర్ల విశ్వరూపం.. రెండో టెస్టులో పట్టుబిగించిన టీమిండియా!

అమరవీరుల త్యాగఫలం.. భరతమాతకు అభినందనం.. టీవీ9 ప్రత్యేక కార్యక్రమం

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్… బీటెక్‌లో ఆరు కొత్త కోర్సులు.!

లీకైన దేవరకొండ ‘ఫైటర్’ లుక్.. ఫోటోలు వైరల్.!

వినియోగదారులకు శుభవార్త.. తగ్గిన గ్యాస్ సిలెండర్ ధరలు..

టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. సఫారీల సిరీస్‌కు ఆ ఇద్దరూ దూరం.?