పులివెందుల: నామినేషన్‌కు ముందు పులివెందులలో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శులు చేశారు. చంద్రబాబుకు పవన్ పార్ట్‌నర్ అని, చంద్రబాబు ఎలా ఆదేశిస్తే అలా పవన్ చేస్తారని విమర్శించారు.
చంద్రబాబు ఎలా చెబితే అలా చేసిన సీబీఐ మాజీ అధికారిని కూడా పవన్ పార్టీలో చేర్చుకున్నారని, అందరూ గొప్ప గొప్ప డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గాజువాకలో నామినేషన్ వేసిన సమయంలో తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపించాయని, ప్రతిపక్షం ఓట్లు చీల్చేందుకు రకరకాల ఎత్తులు చంద్రబాబు వేస్తున్నారని జగన్ ఫైరయ్యారు.