‘జబర్దస్త్’లో మొదలైన లొల్లి.. ఇకపై బాధ్యత అంతా మెగా బ్రదర్ చేతుల్లోకి!

బుల్లితెరలో వస్తున్న ‘జబర్దస్త్’షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురువారం, శుక్రవారం ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోతారు. అంతేకాక జబర్దస్త్ రేటింగ్స్ కూడా అమోఘంగా ఉంటాయి. ఈ షోకు ఇంతటి పాపులారిటీ రావడంతో తెర ముందు నాగబాబు, రోజాతో పాటు కంటెస్టెంట్ల కామెడీ ఎంత ముఖ్యమో.. తెర వెనుక దర్శద్వయం నితిన్-భరత్‌లు కూడా అంటే ముఖ్యం. ఇప్పటివరకు క్రియేటివ్ హెడ్స్‌గా వ్యవహరిస్తున్న వీరు షో నుంచి బయటికి వచ్చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుడిగాలి సుధీర్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న […]

'జబర్దస్త్'లో మొదలైన లొల్లి.. ఇకపై బాధ్యత అంతా మెగా బ్రదర్ చేతుల్లోకి!
Follow us

|

Updated on: Oct 17, 2019 | 5:37 PM

బుల్లితెరలో వస్తున్న ‘జబర్దస్త్’షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురువారం, శుక్రవారం ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోతారు. అంతేకాక జబర్దస్త్ రేటింగ్స్ కూడా అమోఘంగా ఉంటాయి. ఈ షోకు ఇంతటి పాపులారిటీ రావడంతో తెర ముందు నాగబాబు, రోజాతో పాటు కంటెస్టెంట్ల కామెడీ ఎంత ముఖ్యమో.. తెర వెనుక దర్శద్వయం నితిన్-భరత్‌లు కూడా అంటే ముఖ్యం. ఇప్పటివరకు క్రియేటివ్ హెడ్స్‌గా వ్యవహరిస్తున్న వీరు షో నుంచి బయటికి వచ్చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సుడిగాలి సుధీర్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న ‘పోవే పోరా’ షో విషయంలో వీరికి, మల్లెమాల ప్రొడక్షన్స్ మధ్య ఏవో మనస్పర్థలు చోటు చేసుకున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో వారిద్దరూ షో నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని గ్రహించిన షో నిర్వాహకులు మెగా బ్రదర్ నాగబాబుకు ‘జబర్దస్త్’ పూర్తి బాధ్యతలను అప్పగించారట. గతంలో సీరియల్స్ రాసిన అనుభవం కలిగిన నాగబాబు.. ప్రస్తుతం ఈ షోపై ప్రత్యేక శ్రద్ద వహించారని సమాచారం.

ఇందులో భాగంగానే లావుగా ఉన్న కొంతమంది కంటెస్టెంట్లను బరువు తగ్గించుకోవాలని సూచించారట. అంతేకాకుండా స్కిట్స్‌లో మరింత పదునుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. నితిన్-భరత్‌లు లేకపోయినా.. షో రేటింగ్స్ పడిపోకుండా జాగ్రత్త పడాలని చూస్తున్నారు. చూడాలి మరి ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో?