భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు ఎలక్ట్రిక్ స్కూటర్లు వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఇందన ధరల నుంచి తప్పించుకోడానికి ఈవీ వాహనాలను ఇష్టపడుతున్నా అవి భారీ ధరల్లో ఉండడంతో సగటు ఉద్యోగి వాటిని కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ అందుబాటులో ధరలో ఇవూమి స్కూటర్ ప్రస్తుతం మార్కెట్‌లో విక్రయానికి సిద్ధంగా ఉంది. రూ.69,999 కే ఇవూమి ఎస్1 స్కూటర్ వినియోగదారుల సొంతం అవుతుంది. అంతేకాదు ఈ స్కూటర్ ఏకంగా 240 కిలో మీటర్ల పరిధి అందించడంతో దీని నిర్వహణ చాలా సింపుల్‌గా ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా అన్ని అధునాతన ఫీచర్లతో ఈ స్కూటర్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్కూటర్ ఫీచర్లు ఏంటి? స్కూటర్ కొనుగోలు ఏఏ బ్యాంకులు సహకరిస్తున్నాయో? వంటి విషయాలను ఓ సారి తెలుసుకుందాం.
ఈ స్కూటర్ 1500 వాట్స్ బ్యాటరీతో బీఎల్‌డీసీ మోటర్‌తో నడుస్తుంది. ఫ్రంట్, బ్యాక్ డిస్క్ బ్రేక్‌లతో ఈ స్కూటర్ వినియోగదారుల మనస్సును దోచుకుంటుంది. అలాగే కేవలం 3-4 గంటల్లో ఈ స్కూటర్ పూర్తిగా చార్జ్ అవుతుంది. అలాగే కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ స్కూటర్ ఓ సారి చార్జ్ చేస్తే ఏకంగా 240 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. కేవలం రెండు గంటల్లో 0-50 శాతం వరకూ చార్జ్ అవుతుంది. గంటకు గరిష్టంగా 57 కిలోమీటర్ల స్పీడ్ ఈ స్కూటర్ వెళ్తుంది. అలాగే కంపెనీ కూడా బ్యాటరీపై మూడు సంవత్సరాల వారెంటీని అందిస్తుంది. అలాగే ఈ స్కూటర్‌లో ఎకో, రైడర్, స్పోర్ట్స్ అని మూడు మోడ్స్ ఉంటాయి. పికాక్ బ్లూ, నైట్ మెరూన్, డస్కీ బ్లాక్ రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది. జీపీఎస్ ట్రాకర్‌తో పాటు, మానిటరింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఈ స్కూటర్‌లో ఉండే ఫైండ్ మైరైడ్ ఫీచర్ ఆకట్టుకునేలా ఉంది.
ఈ మధ్య కాలంలో బ్యాంకులు కూడా ఈవీ వాహనాల కొనుగోలుకు విరివిగా లోన్లు ఇస్తున్నాయి. ఈ ఇవూమి స్కూటర్ కొనుగోలుకు కూడా అన్ని తగ్గింపులు వర్తిస్తాయి. అలాగే ఈ స్కూటర్‌కు వంద శాతం ఫైనాన్స్ అందిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సెర్వ్, ఐఎండ్ టీ బ్యాంకులు ఫైనాన్స్ అందిస్తున్నాయి. సామాన్యుడు ఈఎంఐలో వాహనం తీసుకోడానికి వీలుగా వడ్డీ రేట్లు కూడా అందుబాటు ధరల్లో ఉన్నాయి.
ఇవూమి స్కూటర్లలో ఎస్1 80, ఎస్1 100, ఎస్1 240తో సహా నాలుగు వేరియంట్లు ఉన్నాయి. వీటిల్లో టాప్ వేరియంట్ 240 కిలో మీటర్ల పరిధి అందిస్తుంది. ఇందులో 4.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే అదనంగా 2.5 కెడబ్ల్యూ మోటర్ ఉంటుంది. ఎంట్రీ లెవెల్ ఎస్1 80లో 1.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఈ స్కూటర్ ఒక్క చార్జిపై 80 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..