ఇండియన్ ఫన్నీ మీమ్స్‌పై స్పందించిన ఇవాంక..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి భార్య మెలానియా, కూతురు ఇవాంకా ట్రంప్ ఇటీవల భారత పర్యటనకు వచ్చివెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో దిగిన ఫోటోలను మెలానియా, ఇవాంక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా బుట్టబొమ్మలా ఎంతో అందంగా ఉండే ఇవాంక ప్రపంచంలో ఏడో వింతైన తాజ్‌మహల్ ముందు దిగిన ఫోటోలు అందానికే వన్నె తెచ్చాయి.

ఇండియన్ ఫన్నీ మీమ్స్‌పై స్పందించిన ఇవాంక..

Updated on: Mar 01, 2020 | 8:01 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి భార్య మెలానియా, కూతురు ఇవాంకా ట్రంప్ ఇటీవల భారత పర్యటనకు వచ్చివెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో దిగిన ఫోటోలను మెలానియా, ఇవాంక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా బుట్టబొమ్మలా ఎంతో అందంగా ఉండే ఇవాంక ప్రపంచంలో ఏడో వింతైన తాజ్‌మహల్ ముందు దిగిన ఫోటోలు అందానికే వన్నె తెచ్చాయి. ఇవన్నీ పక్కనే బెడితే..మీమ్స్‌ను కళాత్మకంగా డిజైన్ చేసే మన ఇండియన్ నెటిజన్స్..ఇవాంక అందానికి దాసోహమయ్యారు. ఇవాంకతో కలిసి ఉన్న రకరకాల ఫన్నీ మార్ఫ్‌డ్ ఫోటోస్ అండ్ మీమ్స్‌తో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నారు.

ముఖ్యంగా దిల్జిత్ దోసంజ్ అనే సింగర్ అండ్ యాక్టర్‌ గురించి మీరు వినే ఉంటారు. ప్రముఖ మహిళలతో తాను కలిసి ఉన్నట్టు మార్ఫ్‌డ్ ఫోటోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అమెరికన్ రియాలిటీ స్టార్ కైలీ జెన్నర్‌పై ఆయనకున్న ప్రేమ అందరికీ తెలిసిందే. ఇప్పుడు అతడి మనసు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌వైపు మళ్లింది. ఇక ఊహించిన విధంగానే తాజ్ ముందు ఆమె దిగిన ఫోటోతో మనోడు వెరైటీ మీమ్‌తో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాడు. “తాజ్‌మహల్‌కి తీసుకెళ్లమని ఇవాంక వెంటపడింది. ఇక చేసేముంది తీసుకొచ్చా” అంటూ ఇవాంకపై కాలువేసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేశాడు. అది నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. అవేకాదు..ఇవాంకను సైకిల్‌పై ఎక్కించుకెళ్తోన్నట్టు, ఆమె భుజంపై చేయి వేసినట్టు రకరకాల మార్ఫ్‌డ్ ఫోటోలు ట్రెండ్ అయ్యాయి. అయితే ఊహించని విధంగా ఇవాంక ట్రంప్ ఆ మీమ్స్‌కి రిప్లై ఇచ్చింది. ముందుగా ఇల్జిత్ దోసంజ్ రిప్లై ఇస్తూ..అద్భుతమైన తాజ్‌మహల్ వద్దకు తీసుకెళ్లినందుకు థ్యాంక్స్..ఆ అనుభవాన్ని లైఫ్‌లో మర్చిపోలేనంటూ ట్వీట్ చేసింది. మరికొన్ని ఫన్నీ ఫోటోలకు సమాధానంగా “భారతీయుల ఆతిథ్యాన్ని మర్చిపోలేను, నేను చాలా మంది కొత్త ప్రెండ్స్‌ను సంపాదించుకున్నాను” మరో ట్వీట్‌లో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడి కూతురు మనవాళ్లకు రిప్లై ఇవ్వడమేంటని షాక్‌లో ఉన్నారు చాలామంది. ఏంటి మీరూ నమ్మట్లేదా..? కావాలంటే దిగువనున్న ట్వీట్స్ చూడండి.