కరోనా సంక్షోభం నుంచి బయటపడుతోన్న ఇటలీ..

| Edited By:

Jul 23, 2020 | 9:16 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మరి బారి నుంచి ఇటలీ క్రమంగా బయటపడుతోంది. ఇటలీలో ఇప్పటివరకూ 2.45 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా సంక్షోభం నుంచి బయటపడుతోన్న ఇటలీ..
Follow us on

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మరి బారి నుంచి ఇటలీ క్రమంగా బయటపడుతోంది. ఇటలీలో ఇప్పటివరకూ 2.45 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1.98 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు పన్నెండు వేలు మాత్రమే. కాగా… 35 వేల మంది వైరస్‌తో చనిపోయారు. కొత్త కేసులు కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టాయి. పదుల సంఖ్యలో మాత్రమే కేసులు నమోదవుతున్నాయి.

కరోనా సంక్షోభ సమయంలో.. మిలాన్‌లోని ఓ ఆసుపత్రిలో 500 బెడ్‌లు ఉంటే… కరోనా పంజా విసిరిన టైమ్‌లో 600 మంది వరకూ చికిత్స పొందేవారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 40 నుంచి 50 శాతం మాత్రమే కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కాగా… ఐసీయూ మొత్తాన్ని మాత్రం కరోనా రోగులకే కేటాయించారు.

Also Read: ఎంట్రెన్స్‌ పరీక్షలు రద్దు.. డీమ్డ్‌ వర్సిటీలకు డిమాండ్..