ఆధార్ సవరణ బిల్లుకు.. అడ్డుపడిన కాంగ్రెస్‌

ఆధార్ సవరణ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును సభ ముందుకు తీసుకురాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్ సభ్యులు అన్నారు. లోక్‌సభలో బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ రామచంద్రన్ వ్యతిరేకించారు. ఈ బిల్లు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా ఉందన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు ప్రజల డేటా సులభంగా […]

ఆధార్ సవరణ బిల్లుకు.. అడ్డుపడిన కాంగ్రెస్‌

Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 24, 2019 | 5:09 PM

ఆధార్ సవరణ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును సభ ముందుకు తీసుకురాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్ సభ్యులు అన్నారు.

లోక్‌సభలో బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ రామచంద్రన్ వ్యతిరేకించారు. ఈ బిల్లు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా ఉందన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు ప్రజల డేటా సులభంగా లభిస్తుందని.. ఇది ప్రైవసీకి భంగం కలిగిస్తుందన్నారు.

అయితే కాంగ్రెస్ వాదనను రవిశంకర్ ప్రసాద్ కొట్టిపారేశారు. ఆధార్ బిల్లును సుప్రీం సమర్ధించిందని అన్నారు. ఇప్పటికే 60 కోట్ల మందికి పైగా ఆధార్‌తో సిమ్ కార్డులు తీసుకున్నారని తెలిపారు. ఆధార్‌ను దేశ ప్రజలు ఆదరిస్తున్నారని స్పష్టం చేశారు.