PSLV-C50 రాకెట్‌ ప్రయోగం విజయవంతం.. ఇస్రో పరిశోధకులకు అభినందనలు

|

Updated on: Dec 17, 2020 | 4:28 PM

PSLV- C50రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. నిప్పులు చిమ్ముకుంటూ.. దేశీయ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు కక్ష్యలోకి పంపింది ఇస్రో.

PSLV-C50 రాకెట్‌ ప్రయోగం విజయవంతం.. ఇస్రో పరిశోధకులకు అభినందనలు

PSLV- C50రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. నిప్పులు చిమ్ముకుంటూ.. దేశీయ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు కక్ష్యలోకి పంపింది ఇస్రో. నిర్ధేశిత సమయంలోనే ఉపగ్రహం కక్ష్యలోకి చేరుకునేలా కృషిచేశారు సైంటిస్టులు.

మొత్తం 1410 కిలోల బరువు కలిగిన 42వ దేశీయ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం CMS-01ను ఈ రాకెట్‌ జియో స్టేషనరీ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లోకి చేరవేసింది. 2011లో ప్రయోగించిన జీశాట్‌-12 కాలపరిమితి ముగిసిపోవడంతో దాని ప్లేస్‌లో జీశాట్‌-12R ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలని ఇస్రో నిర్ణయించింది.

అయితే ప్రస్తుతం దాని పేరును CMS-01గా మార్చి కక్ష్యలోకి చేరవేశారు. 25గంటల కౌన్‌డౌన్‌ పూర్తైన తర్వాత మధ్యాహ్నం 3 .41 నిమిషాలకు PSLV సి 50 రాకెట్‌ను నింగిలోకి పంపారు. GSAT -14R అనే ఉపగ్రహాన్ని 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూస్థిర కక్షలోకి ప్రవేశ పెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Dec 2020 04:28 PM (IST)

    శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ శివన్ అభినందనలు

    పీఎస్‌ఎల్వీ సి-50 వాహక నౌక ఆనంద్ విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ వ్యవస్థ సీఎంఎస్‌-01 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ మోసుకెళ్లింది. ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ కాక మునుపు శివన్ పరిశోధనలో పాల్గొన్న అందరికి అభినందనలు తెలిపారు.

  • 17 Dec 2020 04:08 PM (IST)

    నింగిలోకి విజయవంతంగా ఆనంద్ (పీఎస్‌ఎల్వీ సి-50)

    పీఎస్‌ఎల్వీ సి-50 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ వ్యవస్థ సీఎంఎస్‌-01 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ మోసుకెళ్లింది. సీఎంఎస్-01 ఫ్రీక్వెన్సీ స్ప్రెక్ట్రంలో విస్తరించిన సీ-బ్యాండ్‌ సేవలను అందించేందుకు నిర్దేశించిన ఉపగ్రహం. దీని పరిమితి భారత్‌తో పాటు, అండమాన్‌-నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌లకు విస్తరిస్తుంది. సీఎంఎస్‌ భారతదేశపు 42వ కమ్యునికేషన్‌ ఉపగ్రహం. పీఎస్‌ఎల్వీ-సీ50 ఎక్స్‌ఎల్‌ ఆకృతిలో 22వదని గతంలో ఇస్రో తెలిపింది.

  • 17 Dec 2020 04:05 PM (IST)

    PSLV సి 50 రాకెట్‌ విజయవతం

    Isro’s PSLV-C50/CMS-01 mission successful

  • 17 Dec 2020 03:54 PM (IST)

    మూడో దశ విజయవంతం అయ్యింది..

    PSLV సి 50 రాకెట్‌ మూడో దశ విజయవంతం అయ్యిందని పరిశోధకులు వెల్లడించారు. పరిశోధకులు అనుకున్నట్లుగా మూడో స్టేజ్ విజయవంతంగా ముగిసింది.

  • 17 Dec 2020 03:52 PM (IST)

    ఈ ఉపగ్రహం 7 సంవత్సరాలు కక్షలో తిరుగుతూ సేవలు అందిస్తుంది..

    ఈ ఉపగ్రహంలో అమర్చిన ఎక్స్‌టెన్డడ్ సి బ్యాండ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ర్టమ్ వల్ల భారత్‌తో పాటు అండమాన్‌ నికోబార్‌ దీవులకు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అంతరాయం లేకుండా అందుతాయి. ఈ ఉపగ్రహం 7 సంవత్సరాలు కక్షలో తిరుగుతూ సేవలు అందిస్తుంది.

  • 17 Dec 2020 03:50 PM (IST)

    PSLV సి 50 రాకెట్‌ మూడో దశ నార్మల్..

    PSLV సి 50 రాకెట్‌ మూడో దశలో కూడ నార్మల్‌గా దూసుకుపోయింది.

  • 17 Dec 2020 03:47 PM (IST)

    PSLV సి 50 రాకెట్‌ రెండో స్టెజ్ నార్మల్..

    GSAT -14R అనే ఉపగ్రహంను 36000 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూస్థిర కక్షలోకి ప్రవేశ పెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ఉపగ్రహంను మొదట 18000 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూ బదిలీ కక్ష నుండి 36000 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూ స్థిర కక్షలోకి ప్రవేశించింది.

  • 17 Dec 2020 03:44 PM (IST)

    నింగిలోకి దూసుకెళ్తున్న PSLV-C50 రాకెట్‌..

    మొదటి ఫేస్ సక్సెస్..

Follow us
వేసవిలో మీ ఫ్యాన్‌ స్పీడ్‌ తగ్గిందా? ఇలా చేస్తే మరింత వేగం
వేసవిలో మీ ఫ్యాన్‌ స్పీడ్‌ తగ్గిందా? ఇలా చేస్తే మరింత వేగం
తక్కువ స్కోరు ఉన్నా.. ఒలింపిక్ ట్రయల్స్‌లో భారత షూటర్‌కు ఛాన్స్
తక్కువ స్కోరు ఉన్నా.. ఒలింపిక్ ట్రయల్స్‌లో భారత షూటర్‌కు ఛాన్స్
కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..
కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..
13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..
12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..
8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!
8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!
నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..
నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..
చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!
చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!
జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..